శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 13, 2020 , 01:45:43

పల్లెల అభివృద్ధికి పెద్దపీట

పల్లెల అభివృద్ధికి పెద్దపీట

పెద్దపల్లి జంక్షన్‌: సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతి అమలు చేయిస్తూ పల్లెల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామ పంచాయతీ నిధుల నుంచి కొనుగోలు చేసిన నూతన ట్రాక్టర్‌కు ఎమ్మెల్యే పట్టణంలోని హనుమాన్‌ ఆలయ ఆవరణలో బుధవారం పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్లెల ప్రగతికి ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకు న్నారన్నారు. పల్లెప్రగతితో గ్రామాల్లో సమూల మార్పులు వస్తున్నాయని వివరించారు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌, బ్లేడ్‌ కొనుగోలు చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ నిధులతో కొన్న నూతన ట్రాక్టర్‌ను గ్రామాభివృద్ధి పనులకే వినియోగించాలని స్పష్టం చేశారు. హరితహారంలో నాటిన మొక్కలకు నీళ్లు పోసేందుకు, చెత్తను డంపింగ్‌ యార్డులకు తరలించేందుకు రోడ్లను చదును చేసేందుకు, గుంతలు పూడ్చేందుకే ట్రాక్టర్‌ను వినియోగించాలని సూచించారు. ఇష్టా రీతిన ట్రాక్టర్‌ను వినియోగిస్తే గ్రామ పంచాయతీపై ఇంధన భారం పడుతుందని తెలిపారు. ఈ విషయమై స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నావిరివిగా నాటాలి.. సంరక్షించాలి


సుల్తానాబాద్‌రూరల్‌: గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించాలని ఎంపీడీఓ గంగుల సంతోష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. నారాయణరావుపల్లి, గొల్లపల్లి, సాంబయ్యపల్లి గ్రామాల్లో బుధవారం నిర్వహించిన గ్రీన్‌ డే కార్యక్రమానికి ఎంపీడీఓ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని నర్సరీలను సందర్శించి మొక్కల వివరాలను ఫీల్డ్‌ అసిస్టెంట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ,  కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం పంచ సూత్రాలను పాటించాలని సూచించారు. ఇంటికో కిచెన్‌ గార్డెన్‌, కం పోస్టు పిట్‌, ఇంకుడుగుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మించడంతో పాటు వాటిని వినియోగించుకోవాలని వివరించారు. పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఎవరి ఇంటి ముందు వారు చెత్తను తొలగించుకోవాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి అప్పగించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచులు మొల్గూరి వెంకటలక్ష్మి, బండారి రమేశ్‌, బాపిరెడ్డి, ఎంపీటీసీ సభ్యు డు గట్టు శ్రీనివాస్‌, ఉప సర్పంచులు, వార్డుసభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

ముమ్మరంగా మట్టి నింపే పనులు

ధర్మారం : ధర్మారం మండలం కటికెనపల్లిలోని హరిత హారం నర్సరీల్లోని సంచు ల్లో మట్టి నింపే కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. చిన్న సంచుల్లో పెరిగిన మొక్కలను పెద్ద సంచుల్లోకి మారుస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఆ పనులను సర్పంచ్‌ కారుపాకల రాజయ్య పరిశీలించారు. త్వరితగతిన మొక్కలను సంచుల్లోకి నింపాలని సూచించారు. వేసవిలో మొక్కల సంరక్షణకు అన్ని చర్యలు చేపట్టాలని, ప్రతి మొక్కను సంరక్షించాలని ఆయన  ఉపాధి కూలీలకు, ఫీల్డు అసిస్టెంట్‌ వేణుకు వివరించారు. ఇక్కడ సర్పంచ్‌ వెంట గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎండీ హఫీజ్‌ ఉన్నారు.

జోరుగా ‘ఉపాధి’ పనులు

జూలపల్లి : మండల వ్యాప్తంగా మొక్కల పెంపకం కేంద్రాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జోరుగా కొసాగుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు కూలీలు నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేస్తున్నారు. మండలంలో మొత్తం 13 మొక్కల పెంపకం కేంద్రాలు న్నాయి. ఒక్కో కేంద్రం లో బుధవారం 25 వేల మొక్కలు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఒక్క రోజులో 2 వందలకు పైచిలుకు కూలీలు పనుల్లో నిమగ్నమయ్యారు. కూలీల పనితీరును మండల కేంద్రంలో ఎంపీడీఓ వేణుగో పాల్‌రావు, పంచాయతీ కార్యదర్శి అనంతుల లచ్చయ్య కలిసి పరిశీలించారు. కూలీలకు సలహాలు, సూచనలు ఇచ్చారు.

ఆహ్లాదకరమైన వాతావరణం కోసం..

పెద్దపల్లి జంక్షన్‌: స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం విరివిగా మొ క్కలు నాటి సంరక్షించాలని పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ అధికారి నరహరి సూచించారు.  హన్మంతునిపేటలో నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్‌ శీతాకాల శిబిరంలో భాగంగా బుధవారం వాలంటీర్లు వానర వనంలో నాటిన పండ్ల మొక్కల చుట్టూ పాదులు తీసి రక్షణ కవచాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో  ప్రోగ్రామ్‌ అధికారి నరహరి, అధ్యాపకులు ప్రసూన, దీప, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. రు. కార్యక్రమంలో బండారి రామ్మూర్తి, సర్పంచ్‌ రేవతి, ఉప సర్పంచ్‌ అంజలి, నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, కుమారస్వామి, అశోక్‌ తదితరులున్నారు. 


logo