బుధవారం 08 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 11, 2020 , 03:48:43

స్వరాష్ట్రంలోనే అభివృద్ధి బాటలు

స్వరాష్ట్రంలోనే అభివృద్ధి బాటలు
  • సీఎం కేసీఆర్‌ కృషితో ఆదర్శంగా తెలంగాణ
  • ప్రగతి కోరుకునే వారంతా టీఆర్‌ఎస్‌తో కలిసి రావాలని పిలుపు
  • నాటి పాలకుల హయాంలో జరిగింది శూన్యం
  • ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
  • కాంగ్రెస్‌ నాయకులకు పార్టీలోకి ఆహ్వానం

కలెక్టరేట్‌ : ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న వారంతా పార్టీలకతీతంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని దాసరి క్యాంపు కార్యాలయం లో ఓదెల, పెద్దపల్లి మండలాలకు చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే దాసరి పార్టీ కండువాలు కప్పి సా దరంగా ఆహ్వానించారు. ఓదెల మండలం పొత్కపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు రెడ్డి శ్రీనివాస్‌, ఆళ్ల సుమన్‌రెడ్డి, పెద్దపల్లి మండలం పెద్దకల్వలకు చెందిన నర్ల పోల్‌రాజు, సాయికృష్ణ వారి అనుచరులతో కలిసి కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధికి బాటలు పడ్డాయని పేర్కొన్నారు. గతంలో పాలించిన వారు, ప్రభుత్వాలు ఏనాడూ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకున్న పాపా న పోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలను అమలు చేస్తుండడంతో రాజకీయ పార్టీలతో పాటు ఇతర రాష్ర్టా లు కూడా తెలంగాణను ఆసక్తిగా గమనిస్తున్నాయ ని చెప్పారు. గ్రామాలు, పట్టణాల్లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గమనిస్తున్న వారంతా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నా రు. అభివృద్ధిని కాంక్షించేవారంతా టీఆర్‌ఎస్‌ పార్టీ తో కలిసి రావాలని ఎమ్మెల్యే దాసరి పిలుపునిచ్చా రు. తెలంగాణ బిడ్డలుగా అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా ఉంటూ, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.


సహకార ఎన్నికల్లో సత్తా చాటాలి..

పెద్దపల్లి నియోజకవర్గంలోని 13 సహకార సం ఘాల ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు సత్తాచాటాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 15న జరిగే ఎన్నికల్లో మెజార్టీ డైరెక్టర్‌ స్థానాలను టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు కైవసం చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. నియోజకవర్గ పరిధిలోని 13 సంఘాల్లోనూ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానాలను టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే దక్కించుకుని, ఆయా సంఘాలపై గులాబీ జెండాను ఎగురవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌వీ జిల్లా కో-ఆర్డినేటర్‌ కొయ్యడ సతీశ్‌గౌడ్‌, నాయకులు కారె శ్రీనివాస్‌, ఐరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి, పత్తి సమ్మిరెడ్డి, ఆకుల మహేందర్‌, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


టీఆర్‌ఎస్‌లోకి సహకార డైరెక్టర్‌..

సుల్తానాబాద్‌ సహకార సంఘం 11వ నియోజకవర్గ డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన మేకల రాజయ్య సోమవారం ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే దాసరి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ రాజయ్య కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తనను పార్టీలకతీతంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా కృషి చేసిన నాయకుల సూచనలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పాల రా మారావు, నాయకులు బుర్ర శ్రీనివాస్‌గౌడ్‌, మొ ల్గూరి అంజయ్యగౌడ్‌, మోహన్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, శేఖర్‌ స్థానిక నాయకులు పాల్గొన్నారు. 


logo