మంగళవారం 31 మార్చి 2020
Peddapalli - Feb 11, 2020 , 03:48:02

153 స్థానాలకే ఫైట్‌

153 స్థానాలకే ఫైట్‌
  • బరిలో 483 మంది అభ్యర్థులు

జిల్లాలోని 20 పీఏసీఎస్‌లలో 260 డైరెక్టర్‌ స్థానాలు ఉండగా, ఇందులో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల లెక్కలేలింది. నందిమేడారం, మేడిపల్లి, ధూళికట్ట సంఘాలు క్లీన్‌స్వీప్‌ కాగా, మిగతా 17 సంఘాలలోని నియోజకవర్గాలకే ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 934 మంది దరఖాస్తులు సమర్పించగా, ఉపసంహరణ నాటికి 451మంది పోటీ నుంచి తప్పుకోవడంతో 107 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 153 స్థానాలకు 483 మంది పోటీలో నిలిచినట్లు అధికారులు తెలిపారు. ఇందులో అప్పన్నపేటలో పరిధిలో 4 స్థానాలు, చిన్నకల్వలో 6, కూనారంలో 7, జూలపల్లిలో 7, మంథని 8, కనుకుల 8, ఎలిగేడుల్లో 8, కమాన్‌పూర్‌లలో 8, పత్తిపాకలో 9, సుల్తానాబాద్‌ 9, పెద్దపల్లి 9, సుద్దాల 11, కాల్వశ్రీరాంపూర్‌ 11, ముత్తారం 11, కన్నాల 12, గర్రెపల్లిల్లో 12, పొత్కపల్లి పీఏసీఎస్‌లో 13 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.   logo
>>>>>>