శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 11, 2020 , 03:43:02

శాశ్వత పరిష్కారం చూపండి

శాశ్వత పరిష్కారం చూపండి

గోదావరిఖని, నమస్తే తెలంగాణ : రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి వెలువడుతున్న వృథా నీరు శాంతినగర్‌, ప్రగతి నగర్‌లోకి రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆర్‌ఎఫ్‌సీఎ ల్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ విభాగం అధికారులకు సూచించారు. ఈ మేరకు స్థానిక క్యాంపు కా ర్యాలయంలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌, కార్పొరేషన్‌ అధికారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎరువుల కర్మాగారం యా ష్‌పాండ్‌  నుంచి వృథా నీరు కాలనీల్లోని ఇళ్లలో చేరుతున్నదని, ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తాము స్వయంగా కాలనీలను సందర్శించామని తెలిపారు. 20 రోజుల్లో సమస్యను పరిష్కరిష్కరించాలని సూచించారు. యాష్‌పాండ్‌లో వ్యర్థాలను తొలగించాలనీ, ఇళ్లలోకి నీరు చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇంజినీరింగ్‌ అధికారులు సర్వే నిర్వహించి శాశ్వత పరిష్కారం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మేయర్‌ అనిల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ నడిపల్లి అభిషేక్‌ రావు, ఇంజినీర్లు మాధవి, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ అధికారులు సోమనాథ్‌, నాయకులు గోపగాని మోహన్‌ గౌడ్‌ తదితరులున్నారు.


logo