శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 10, 2020 , 02:37:31

హరిత నర్సరీలు సిద్ధం చేయాలి

హరిత నర్సరీలు సిద్ధం చేయాలి

ధర్మారం : హరితహారం కోసం మొక్కలు పెం చేందుకు నర్సరీలను త్వరగా సిద్ధం చేయాలనీ, సంచులలో మట్టి నింపే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు. ధర్మారం మండలం ఖానంపల్లి గ్రామం లో కలెక్టర్‌ పర్యటించి, గ్రామ శివారులోని నర్సరీని పరీశీలించారు. మొక్కలను సంచుల్లో అమర్చడానికి 100 మంది కూలీలను ఏర్పాటు చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఏమా త్రం నిర్లక్ష్యం చేయవద్దని, మొక్కల సంరక్షణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అ నంతరం కలెక్టర్‌ గ్రామంలో పల్లె ప్రగతిలో నిర్మించిన సామూహిక  మరుగుదొడ్డి, నర్సింహుపల్లి గ్రామంలోని వైకుంఠధామాన్ని పరిశీలించారు. వైకుంఠధామం నిర్మాణ విధానం గురించి జడ్పీ సీఈఓ వినోద్‌ కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ మాట్లాడారు. హరితహారం మొక్కల పెంపకంపై శ్రద్ధ చూపాలన్నారు. నర్సరీల పురోగతిపై ఎప్పటికప్పుడు రిపోర్టులను కలెక్టర్‌ కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. హరితహారం మొక్కల పెంపకానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదనీ, ఈ ఏడాది నాటిన మొక్కలు 85 శాతం దక్కేలా సంరక్షించాలని చెప్పారు. చనిపోయిన మొక్కల స్థా నంలో కొత్త మొక్కలు నాటి కాపాడాలని కోరారు. ప్రజలను భాగస్వాములను చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. ఉపాధి హామీ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. గ్రామా ల్లో వైకుంఠ ధామాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు గుర్రం మనీషా, అడువాల అరుణజ్యోతి, ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీ సభ్యురాలు పూస్కూరు పద్మజ, జడ్పీ సీఈఓ వినోద్‌, జిల్లా పంచాయతీ అధికారి వేముల సుదర్శన్‌, జిల్లా అటవీ శాఖ అధికారి రవి ప్రసాద్‌, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కోఆర్డినేటర్‌ సరిత, తాసిల్దార్‌ సీ సంపత్‌, ఎంపీడీఓ బాలరాజు, ఏఎంసీ చైర్మన్‌ గుర్రం మోహన్‌రెడ్డి, ఉపాధిహామీ ఏపీఓ రవి తదితరులు పాల్గొన్నారు.


logo