సోమవారం 06 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 10, 2020 , 02:30:38

పనికి తగ్గ వేతనాలివ్వాలి

పనికి తగ్గ వేతనాలివ్వాలి

గోదావరిఖని, నమస్తే తెలంగాణ : సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు పని విధానాన్ని బట్టి వేతనాలు చెల్లించాలని తెలంగాణ కాంట్రాక్ట్‌ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్‌ కోరారు. ఈ మేరకు స్థానిక టీబీజీకేఎస్‌ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా ఏరియా దవాఖానలో విధులు నిర్వహిస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు స్టాఫ్‌ నర్సులకు స్కిల్డ్‌ వేతనాలు ఇవ్వాలనీ, వార్డు బాయ్స్‌కు సెమీ స్కిల్డ్‌ వేతనాలు ఇవ్వాలని గతంలో జీఎం దృష్టికి తీసుకవెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. కార్మికుల పక్షాన నిలబడి కార్మిక హక్కుల పరిరక్షణకు తమ యూనియన్‌ ఎంతగానో కృషి చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఒక్క కార్మికుడు కూడా అన్యాయానికి గురి గాకుండా స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ల సహకారంతో యూనియన్‌ను మరింత బలోపేతం చేసేందుకు కార్మికులు కూడా సహకరించాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఎరుకల నాగరాజు, బోయరాజు, జెల్లి సంపత్‌, ఎలకపల్లి రమేశ్‌, కనకరాజు, సూర్యనారాయణ, మహేందర్‌, మహేశ్‌, కుమారస్వామి, సాయికృష్ణ, సాయికుమార్‌, స్వరూప, శారద, అరుణ, సంధ్యారాణి, స్వప్న, మాధవి తదితరులు ఉన్నారు.


logo