మంగళవారం 31 మార్చి 2020
Peddapalli - Feb 10, 2020 , 02:25:27

నామినేషన్ల పరిశీలన పూర్తి

నామినేషన్ల పరిశీలన పూర్తి

కమాన్‌పూర్‌ : కమాన్‌పూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లో భాగంగా ఆ దివారం నామినేషన్ల పరిశీలన చేపట్టారు. మం డల కేంద్రంలోని పీఏసీఎస్‌ కార్యాలయంలో నా మినేషన్లను ఎన్నికల క్లస్టర్‌ అధికారి జయప్రకాశ్‌రెడ్డి, ఎన్నికల అధికారులు బీ శంకర్‌, తిరుపతిరె డ్డి, రవి, సీఈఓ సంతోష్‌కుమార్‌ పరిశీలించారు. కమాన్‌పూర్‌ పీఏసీఎస్‌ పరిధిలోని 13 నియోజకవర్గ స్థానాలకు 43 మంది అభ్యర్థులు 48 నామినేషన్లను దాఖలు చేశారు. ఈ నెల 10న సోమవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పో టీలో ఉండే అభ్యర్థులను అధికారులు ప్రకటించనున్నారు. అభ్యర్థుల జాబితా ప్రకారంగా గుర్తులు కేటాయించనున్నారు. కమాన్‌పూర్‌ పీఏసీఎస్‌ పరిధిలోని 6వ నియోజకవర్గంలో బానోతు లక్ష్మి ఒక్కరే నామినేషన్‌ వేయగా, ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది. 

ఒక్క నామినేషన్‌ తిరస్కరణ.. 

ముత్తారం : ముత్తారం ‘సహకార’ నామినేషన్ల పరిశీలన సందర్భంగా 1వ వార్డు అభ్యర్థి కర్క మ మత దరఖాస్తును తిరస్కరించినట్లు ఎన్నికల రిటర్నింట్‌ అధికారి విజయ్‌ కుమార్‌ తెలిపారు. ఉమ్మ డి ముత్తారం మండల పరిధి ఆదివారంపేటకు చెందిన ఎలువాక కొమురయ్య రెండు దరఖాస్తు లు సమర్పించగా, ఒకదానిని తిరస్కరించారు. దీంతో దరఖాస్తుల పరిశీలన అనంతరం 13 స్థా నాలకు గాను 50 నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. నేటి నుంచి నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని అధికారులు తెలిపారు. 

మంథనిలో ఒకటి..

మంథనిటౌన్‌ : మంథని సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా ఆదివారం అధికారులు నామినేషన్లను పరిశీలించారు. మంథని సింగిల్‌ విండోలోని 13 నియోజకవర్గాల్లో 50 నామినేషన్లు దా ఖలు కాగా, ఇందులో ఒక దరఖాస్తును అధికారు లు తిరస్కరించారు. నలుగురు అభ్యర్థులు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, ఒక్కొక్క దాన్ని తొలగించారు. దీంతో మంథని సింగిల్‌ విండో పరిధిలోని ఆయా నియోజకవర్గాల్లో 45 నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. 13వ నియోజకవర్గంలో నామినేషన్‌ దాఖలు చేసిన దాసరి రాజేశం ఓవర్‌ డీవ్‌ కారణంగా ఆయన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. 


logo
>>>>>>