శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 09, 2020 , 01:12:11

మొత్తం నామినేషన్లు 1010

మొత్తం నామినేషన్లు 1010
  • ముగిసిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ
  • శుక్రవారం ఒక్కరోజే 709 దాఖలు
  • అట్టహాసంగా వేసిన టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు
  • జిల్లాలో నాలుగు చోట్ల సింగిల్‌ నామినేషన్లు

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార సంఘాల ఎన్నికల్లో చివరి  రోజైన శనివారం నాడు నామినేషన్లు వెల్లువెత్తాయి. మొదటి, రెండో రోజు కన్నా అధిక సంఖ్యలో అభ్యర్థులు తమ నామపత్రాలను దాఖలు చేశారు. గురువారం జిల్లాలోని 62మంది అభ్యర్థులు దాఖలు చేయగా, రెండో 239మంది వేయగా, మూడో రోజు శనివారం భారీగా వచ్చాయి. శనివారం ఉదయం 11గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్ల దాఖలు పక్రియ కొనసాగగా జిల్లాలో మ్తొతం 20 సంఘాలకు 709 నామినేషన్లు దాఖలయ్యా యి.  అభ్యర్థులు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహిస్తూ నామినేషన్‌ కేంద్రాలకు చేరుకున్నారు. చివరి రోజు కావడంతో మధ్యాహ్నం మూడు గంటలకు ముగించాల్సిన నామినేషన్లు స్వీకరణ, అభ్యర్థుల రద్దీతో సా యంత్రం నాలుగు గంటల వరకూ కొనసాగింది. ఈ క్రమంలో మొత్తం   1010 నామినేషన్లు వచ్చాయి.


మండలాలవారీగా నామినేషన్లు ఇవి..

పెద్దపల్లి మండలంలో 92 నామినేషన్లు వచ్చాయి. ఇందులో పెద్దపల్లి పీఏసీఎస్‌కు 47, అప్పన్నపేట పీఏసీఎస్‌కు 45నామినేషన్లు వచ్చాయి. ఓదెల మండలంలోని పోత్కపల్లి పీఏసీఎస్‌ పరిధిలోని 13 ప్రాదేశిక నియోజకవర్గాలకు 67నామినేషన్లు వచ్చాయి. ఇక కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో 87 దరఖాస్తులు రాగా, ఇందులో కాల్వశ్రీరాంపూర్‌ పీఏసీఎస్‌కు 49, కూనారం పీఏసీఎస్‌కు 38 వచ్చాయి. సుల్తానాబాద్‌ మండలంలో 270 నామినేషన్లు రాగా, ఇందులో సుల్తానాబాద్‌కు 84, కనుకుల సంఘానికి 41, సుద్దాలకు 49, చిన్న కల్వలకు 50, గర్రెపల్లి పీఏసీఎస్‌కు 46 దాఖలయ్యాయి. అలాగే ధర్మారం మండలంలో 108 దరఖాస్తులు రాగా, ఇందులో పత్తిపాక పీఏసీఎస్‌కు 52, నందిమేడారం పీఏసీఎస్‌కు 56 నామినేషన్లు వచ్చాయి. ఎలిగేడు మండలంలో 97 దరఖాస్తులు రాగా, ఇందులో  ఎలిగేడు సంఘానికి 48, దూళికట్ట సొసైటీలో 49 వచ్చాయి. మంథని మండలంలోని మంథని పీఏసీఎస్‌కు 50, ముత్తారం మండలంలోని ముత్తారం సంఘానికి 52, రామగుండం మండలం మేడిపల్లి పీఏసీఎస్‌కు-40, కమాన్‌పూర్‌ మండలం కమాన్‌పూర్‌ పీఏసీఎస్‌కు 48, పాలకుర్తి మండలం కన్నాల పీఏసీఎస్‌కు 47, జూలపల్లి పీఏసీఎస్‌కు 52 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందు లో అత్యధికంగా సుల్తానాబాద్‌ పీఏసీఎస్‌కు 84 దరఖాస్తులు రాగా, అత్యల్పంగా కాల్వశ్రీరాంపూర్‌ మండలం కూనారం పీఏసీఎస్‌కు 38 వచ్చాయి. 


నాలుగుచోట్ల సింగిల్‌ నామినేషన్లు..

జిల్లాలో 20 సంఘాల్లో 260 ప్రాదేశిక నియోజకవర్గాలు ఉండగా ఇందులో నాలుగు నియోజకవర్గాలకు సింగిల్‌ నామినేషన్లే వచ్చాయి. ఇందులో కమాన్‌పూర్‌ మండలం కమాన్‌పూర్‌ పీఏసీఎస్‌ పరిధిలోని 6వ ప్రాదేశిక నియోజకవర్గం బానోత్‌ లక్ష్మిమాత్రమే నామినేషన్‌ వేశారు. అలాగే పెద్దపల్లి పీఏసీఎస్‌ పరిధిలోని 6వ ప్రాదేశిక నియోజకవర్గంలో మాదిరెడ్డి నర్సింహారెడ్డి, అప్పన్నపేట పీఏసీఎస్‌ పరిధిలోని 2వ ప్రాదేశిక నియోజకవర్గం నుంచి లోకిని శారద, ధర్మారం మండలం నందిమేడారం పీఏసీఎస్‌లో 7వ నియోజకవర్గం నుంచి ముత్యాల బలరాంరెడ్డి మాత్రమే నామినేషన్‌ వేశారు. ఈ నాలుగు ఈ నియోజకవర్గాల్లో దాఖలైన నామినేషన్లను పరిశీలించిన తర్వాత అభ్యర్థులను ఏకగ్రీవంగా ప్రకటించడం లాంఛనమని చెప్పవచ్చు.logo