ఆదివారం 29 మార్చి 2020
Peddapalli - Feb 09, 2020 , 01:10:48

పరిశుభ్రతే కీలకం

పరిశుభ్రతే కీలకం
  • అవగాహనతోనే అదుపులోకి.. నులి పురుగుల నివారణపై ప్రత్యేక దృష్టిపెట్టాలి
  • కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ జిల్లా కేంద్రంతో అవగాహన ర్యాలీ
  • 1-19 ఏళ్లలోపు వారికి అల్బెండజోల్‌ మాత్రలు వేయాలి

కలెక్టరేట్‌ : నులిపురుగుల నివారణకు పరిశుభ్రతే కీలకమని కలెక్టర్‌ సిక్తి పట్నాయక్‌ స్పష్టం చేశారు.  ఏడాది నుంచి 19 ఏళ్లలోపు వారందరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అవగాహన ద్వారానే నులిపురుగుల వ్యాప్తిని అదుపు చేయవచ్చునని పేర్కొన్నారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన అవగాహన  ర్యాలీని, కలెక్టరేట్‌లో సిక్తా పట్నాయక్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో అధికారులు, సిబ్బందితో కలిసి తెలంగాణ తల్లి విగ్రహం వరకు కలెక్టర్‌ కాలినడకన పాల్గొని ప్రసంగించారు. జిల్లావ్యాప్తంగా నులిపురుగుల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ నెల 10న ఏడాది నుంచి 19 ఏళ్ల లోపు వారందరికీ అల్బెండజోల్‌ మాత్రలు వేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని 706 అంగన్‌వాడీ కేంద్రాల్లో 32,917 మంది, 767 ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో గుర్తించిన 1,45,357 మంది, బడిబయట గుర్తించిన 10,231 మందితో మొత్తం జిల్లాలోని 1,97,785 మందికి అల్బెండజోల్‌ మాత్రలు మింగించాలన్నారు. అందుబాటులో ఉ న్న మాత్రలను అందరికి పంపిణీ చేసేలా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు వై ద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పీ సుధాకర్‌, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ కృపాబాయి, ప్రభుత్వ దవాఖానల సూపరిండెంట్‌ మందల వాసుదేవరెడ్డి, డాక్టర్‌ శిల్పిని, కళాకారులు పాల్గొన్నారు. 


logo