గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 09, 2020 , 01:08:37

సుపరిపాలనే మా లక్ష్యం

సుపరిపాలనే మా లక్ష్యం
  • ప్రజా సంక్షేమానికి అహర్నిశలూ కృషి
  • సమస్యలపై సత్వర స్పందనకు టోల్‌ ఫ్రీ నంబర్‌18005998666 విడుదల
  • ‘డయల్‌ యువర్‌ ఎమ్మెల్యే’లో కోరుకంటి చందర్‌
  • అమ్మవారి ఆశీస్సులతో కనీవినీ ఎరుగని రీతిలో జాతర నిర్వహించాం
  • పథకాల అమలులో అవినీతి, అక్రమాలను సహించేదిలేదు
  • త్వరలోనే అంతర్గాంలో ఇండస్ట్రీయల్‌ పార్కుకు పునాదిగోదావరిఖని, నమస్తే తెలంగాణ : రామగుండం నియోజకవర్గ ప్రజలకు సుపరిపాలన అందిస్తామనీ, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రతి లబ్ధిదారుడికీ చేరాలనీ, అందులో ఎక్కడ అవినీతి జరిగినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో శనివారం ‘డయల్‌ యువర్‌ ఎమ్మెల్యే’ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల కోసం ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఎమ్మెల్యే విడుదల చేశారు. ఎలాంటి సమస్య ఉన్నా 18005998666కు ఫోన్‌ చేసి చెప్పాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో గతంలో మునుపెన్నడూ లేనివిధంగా ఈసా రి గోదావరిఖనిలో సమ్మక్క - సారలమ్మ జాతరకు అనేక నిధులు వెచ్చించి, అంగరంగ వైభవంగా నిర్వహించామని పేర్కొన్నారు. 


రామగుండం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగుతామన్నా రు. కార్పొరేషన్‌ పరిధిలోని 50 డివిజన్లలో సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు పాటుపడుతామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి దేశంలో మరెక్కడా లేనివిధంగా పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో అవినీతికి పాల్పడితే సహించేది లేదనీ, అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరుద్యోగులకు నిలయంగా మారిన రామగుండం ప్రాంతాన్ని ఉపాధి మార్గాలకు నిలయంగా మార్చాలన్న సంకల్పంతో అంతర్గాం మండలంలో 102 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌, ఐటీ మంత్రి కేటీఆర్‌ను ఒప్పించామనీ, త్వరలోనే పార్కు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. తెలంగాణ ఇలవేల్పులు సమ్మక్క, సారలమ్మ జాతరను రామగుండం నియోజకవర్గంలోని జనగామ, గోలివాడ, వేంనూరు, కుక్కలగూడురు, ఈసాల తక్కళ్లపల్లిలో అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు. వనదేవతల ఆశీస్సులు నియోజక వర్గ ప్రజలపై ఉండి ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు. కార్పొరేషన్‌ పరిధిలో ప్రధానంగా రోడ్లు, శానిటేషన్‌ సమస్యలు ఉన్నాయనీ పలువురి నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ అనిల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌ రావు, తాసిల్దార్‌ సుధాకర్‌, ఈఈ మహేందర్‌, కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo