శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 09, 2020 , 01:08:06

రైల్వే సమస్యలు పరిష్కరించండి

రైల్వే సమస్యలు పరిష్కరించండి

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కేంద్ర  రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని శనివారం కలిశారు. రైల్వేకు సంబంధించిన పలు సమస్యల ను పరిష్కరించాలని వినతి పత్రం అందించా రు. ఈ మేరకు ఢిల్లీలోని మంత్రి కార్యాలయం లో కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ వెంకటేశ్‌ నేతకాని, జిల్లాలో నెలకొన్న పలు రైల్వే సమస్యలను వివరించారు. అనంతరం ఎంపీ విలేకరులతో మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని రైల్వే సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రికి వివరించినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి రైల్వేమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ పేర్కొన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూరు మండలం రేచిని రైల్వేస్టేషన్‌లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం, మంచిర్యాల పట్టణంలో హమాలీ జెండా వద్ద ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం, పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో నిరుపయోగంగా ఉన్న గూడ్స్‌ షెడ్‌కు మరమ్మతులు చే యించడంతోపాటు సిమెంట్‌ ప్లాట్‌ఫాం నిర్మించాలని కోరినట్లు చెప్పారు. సికింద్రాబాద్‌ నుం చి కాగజ్‌నగర్‌ వరకు, కాగజ్‌నగర్‌ నుంచి సి కింద్రాబాద్‌ వరకు కొత్తగా ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించాలనీ, భాగ్యనగర్‌ రైలుకు అదన పు బోగీలను చేర్చాలనీ, పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో కొన్ని సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్టింగ్‌ ఇవ్వాలని విన్నవించినట్లు పేర్కొన్నారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆర్వోబీ, ఆర్‌యూబీ పనులను వెంటనే ప్రారంభించాలనీ, పెద్దపల్లి నుంచి కరీంనగర్‌ మార్గంలో రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణాలను ప్రారంభించాలని మంత్రికి ఇచ్చిన వినతి పత్రంలో కోరినట్లు ఎంపీ వెల్లడించారు. 


logo