గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 09, 2020 , 01:04:23

ఆస్తి కోసం ఆలిని హత్య చేసిన భర్త

ఆస్తి కోసం ఆలిని హత్య చేసిన భర్త
  • సుల్తానాబాద్‌ సీఐ గట్ల మహేందర్‌రెడ్డి

సుల్తానాబాద్‌ : ఓదెల మండల కేంద్రంలో బోడకుంట లక్ష్మి (70)ని ఆమే భర్త వెంకయ్య(75)పథకం ప్రకారం హతమార్చిన సంఘటనపై శనివారం సుల్తానాబాద్‌ సర్కిల్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, వివరాలు వెల్లడించారు. బోడకుంట లక్ష్మి, వెంకయ్యలిద్దరూ వృద్ద దంపతులు, వీరికి సంతానం లేదు. ఇటీవలే వారికున్న పొలం అమ్మడంతో వచ్చిన డబ్బును బ్యాంకులో వేయగా వచ్చే వడ్డీతో పాటు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్‌తో జీవనం కొనసాగిస్తున్నారు. అయితే.. వెంకయ్య వచ్చిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ, సొంతానికి వాడుకోవడంతో ఈ విషయంలో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎలాగైన భార్యను అడ్డుతొలగించుకోవాలని పథకం ప్రకారమే ఈ నెల 5న బుధవారం తెల్లవారు జామున నిద్రిస్తున్న భార్య లక్ష్మిని రోకలిబండతో తలపై కొట్టి చంపాడు. అనంతరం వెంకయ్య పరారు కాగా, అనుమానం వచ్చిన  వారి మేనల్లుడు ఎంబాడి మల్లేశ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని విచారించగా.. వెంకయ్య తానే చంపినట్లు ఒప్పుకున్నాడని సీఐ వివరించారు. ఈ క్రమంలో శనివారం అతడిని రిమాండ్‌కు తరలిస్తున్నామని తెలిపారు. అనంతరం సీఐ మాట్లాడుతూ, నేరాలకు పాల్పడితే శిక్ష అనుభవించాల్సిందేననీ సుల్తానాబాద్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ గట్ల మహేందర్‌రెడ్డి తేల్చిచెప్పారు. సీఐతో పొత్కపల్లి ఎస్‌ఐ చంద్రకుమార్‌, కాల్వశ్రీరాంపూర్‌ ఎస్‌ఐ గాయత్రి, ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఇషాఖ్‌ ఉన్నారు. 


logo
>>>>>>