సోమవారం 06 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 08, 2020 , 03:26:56

పోటాపోటీగా నామినేషన్లు

పోటాపోటీగా నామినేషన్లు
  • 20 సహకార సంఘాల్లో 239 దాఖలు
  • చిన్నకల్వలలో అత్యధికంగా 23 నామపత్రాలు
  • నేటితో ముగియనున్న గడువు

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ కోసం రెండో రోజైన శుక్రవారం అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి రోజైన గురువారం జిల్లాలోని 20సహకార సంఘాల్లోని 260ప్రాదేశిక నియోజకవర్గాలకు 62మంది, రెండో రోజు 239మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలోని 20 పీఏసీఎస్‌లలో 40,466 మంది రైతులు సభ్యత్వం కలిగి ఉండగా వీరిలో 30, 685 మందికి మాత్రమే ఓటు హక్కును కలిగి ఉన్నారు. వీరిలో 24,922 మంది పురుషులు, 5,763 మంది మహిళలు ఉన్నారు. ఈ నెల 15 తేదీన సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించనుండడంతో నామినేషన్ల ప్రక్రి య మొదలైంది. ఇప్పటి వరకు జిల్లాలోని 260 ప్రాదేశిక నియోజకవర్గాలకు మొత్తం 301నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం నామినేషన్ల గడువుకు ఆఖరు కావడంతో నామినేషన్లు మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది. 


20సంఘాలకు 239నామినేషన్లు..

జిల్లాలోని 20ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 239మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు జిల్లా సహకార అధికారి చంద్రప్రకాశ్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. ఈ మేరకు సంఘాల వారీగా దాఖలైన నామినేషన్ల వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి-12, అప్పన్నపేట(పెద్దపల్లి)-4, పొత్కపల్లి(ఓదెల)-15, కాల్వశ్రీరాంపూర్‌-16, కూనారం-9, సుల్తాన్‌బాద్‌-12, కనుకుల-7, సుద్దాల(సుల్తాన్‌బాద్‌)-9, గర్రెపల్లి-8, చిన్నకల్వల (సుల్తాన్‌బాద్‌)-23, పత్తిపాక (ధర్మారం)-11, నందిమేడారం(ధర్మారం)-21, ఎలిగేడు-9, దూళికట్ట-10, మంథని-14, ముత్తారం-14, మేడిపల్లి(రామగుండం)-5, కమాన్‌పూర్‌-9, కన్నాల-12, జూలపల్లి-19 సహకార సంఘాల్లోనికి ప్రాదేశిక నియోజకవర్గాలకు 239నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో రెండవ రోజు అత్యధికంగా చిన్నకల్వల పీఏసీఎస్‌లో అత్యధికంగా 23నామినేషన్లు,  అప్పన్నపేటలో అత్యల్పంగా 4నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. నేడు మరింతగా పెరిగే అవకాశం.. శనివారం నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు కావడంతో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దాఖలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 


logo