మంగళవారం 07 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 08, 2020 , 03:24:40

ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
  • కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించాలి
  • పాల్గొన్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌
  • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  • అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌

కలెక్టరేట్‌: ఇంటర్మీడియెట్‌ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్చి 4నుంచి 21వరకు ఇంటర్‌ ప్రథమ, మార్చి 5 నుంచి 23 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందుకు అనుగుణంగా పరీక్షా కేంద్రాలను నిర్ణయించాలని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి విద్యార్థుల సౌల భ్యం కోసం టీఎస్‌బీఈఈ అనే యాప్‌ను రూపొందిం చామని చెప్పారు. ఈ అవకాశంపై  అధికారులు విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. కొన్ని ప్రైవేట్‌ కళాశాలలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వడంలో ఆలస్యం చేసి విద్యార్థులను అయోమయానికి గురిచేస్తున్న నేపథ్యంలో అటువంటి ఇబ్బందులు తలెత్తకుండా   tsbie.cgg.gov.i అనే వెబ్‌సైట్‌ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు. 


ఆన్‌లైన్‌లో ద్వారా తీసుకున్న హాల్‌టికెట్లపై ప్రిన్సిపాళ్ల సంతకం అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై సం బంధిత అధికారులు విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు.  జిల్లాలో ఎక్కడా ప్రశ్నాపత్రాల విషయంలో ఇబ్బందు లు జరుగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దూర ప్రాంతా ల నుంచి వచ్చే విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలచే చేరుకునేలా ప్రత్యేక ప్రణాళికలతో ఆయా రూట్లలో బస్సులను నడిపించాలని మంత్రి ఆదేశించారు. వీసీలో పాల్గొన్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్మీడియెట్‌ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రికి వివరించారు.  వీసీలో కలెక్టర్‌ వెంట ఇంటర్మీడియేట్‌ బోర్డు నోడల్‌ అధికారి కల్పన, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ పీ సుధాకర్‌, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ వసంతరావు, ఎస్‌ఐ సహదేవ్‌సింగ్‌, కలెక్టర్‌ కార్యాలయ సూపరింటెండెంట్‌ తూము రవీందర్‌, సంబంధిత అధికారులుతోపాటు పలువురు పాల్గొన్నారు. 


logo