గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 08, 2020 , 03:24:07

పోలీసుల పనితీరు భేష్‌..

పోలీసుల పనితీరు భేష్‌..

ఓదెల: కొలనూర్‌ జాతరకు అత్యధికంగా భక్తులు తరలి వచ్చిన శాంతిభద్రతలకు  ఇబ్బందులు కల్గకుండా పొత్కపల్లి ఎస్‌ఐ చంద్రకుమార్‌ సమయస్ఫూర్తితో పని చేసిన తీరును ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రశంసించారు. ఆయనను శాలువాతో సన్మానించారు. 15రోజుల నుంచి జాతర ఏర్పాట్ల లో పోలీసులు తగిన సూచనలు, సలహాలు ఇస్తూనే పార్కింగ్‌కు ప్రతేకంగా స్థలం ఏర్పా టు చేయడంతో సమస్యలు తల్తెకుండా ఉంది. జాతరలో ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా సీసీ, డ్రోన్‌ కెమెరాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ తగిన చర్యలు తీసుకున్నారు. సమ్మక్క దేవతను గద్దెకు తీసుకువచ్చే సమయంలోనూ పోలీసులు ముందస్తూ చర్యలు తీసుకున్నారు. అలాగే జాతర చైర్మన్‌ బండారి ఐలయ్యయాదవ్‌, కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, వివిధ శాఖల అధికారులు  సమష్ఠిగా పని చేయడం వల్లనే జాతర సజావుగా ముగిసిందని ఎమ్మెల్యే అభినందించారు. కొత్త రోడ్డు నిర్మాణంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. వివిధ దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చూసినందుకు హర్షం వెలిబుచ్చారు. 


logo