గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 07, 2020 , 02:32:12

‘సహకార’ నామినేషన్లు షురూ..

‘సహకార’ నామినేషన్లు షురూ..

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార నామినేషన్ల పర్వం మొదలైంది. మొదటి రోజైన గురువారం 20 సొసైటీలలో 62 మంది నామినేషన్లు దాఖలు చేశారు. శుక్ర, శనివారాల్లో కూడా నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. ఇప్పటికే ఓటర్ల జాబితా ప్రకటించిన అధికారులు ఈనెల 9న నామినేషన్లు పరిశీలించనున్నారు. 10వ తేదీన ఉపసంహరణ ఉంటుంది. ఈ రోజే బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో తేలనుంది.  జిల్లాలో 20 పీఏసీఎస్‌లు ఉండగా, వాటిలో 40466 మంది రైతులు సభ్యత్వం కలిగి ఉన్నారు. అయితే  30,685 మంది మాత్రమే ఓటు హక్కు ఉంది. ఇందులో 24,922 మంది పురుషులు, 5,763 మంది మహిళలు ఉన్నారు. కాగా.. సహకార ఎన్నికల్లో చాలా మంది రుణాలు చెల్లించకపోవడంతో పోటీ చేయడంతోపాటు ఓటు హక్కును కూడా కోల్పోయారు. అయితే సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో మాదిరిగా అనేక స్థానాలకు ఏకగ్రీవం చేయాలని గులాబీ నాయకులు భావిస్తున్నారు. ఇందుకోసం సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. 


తొలిరోజు 62 నామినేషన్లు.. 

జిల్లాలోని 20 సహకార సంఘాలు ఉండగా, ఇందులో 260ప్రాదేశిక నియోజకవర్గాలకు తొలిరోజు 62 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా సహకార అధికారి చంద్రప్రకాష్‌రెడ్డి తెలిపారు. పెద్దపల్లి-2, అప్పన్నపేట(పెద్దపల్లి)-2, పొత్కపల్లి(ఓదెల)-1, కాల్వశ్రీరాంపూర్‌-2, కూనారం-1, సుల్తాన్‌బాద్‌-7, కనుకుల-1, సుద్దాల(సుల్తాన్‌బాద్‌)-6, గర్రెపల్లి-5, చిన్నకల్వల (సుల్తాన్‌బాద్‌)-2, పత్తిపాక (ధర్మారం)-11, నందిమేడారం(ధర్మారం)-1, ఎలిగేడు-2, దూలికట్ట-1, మంథని-4, ముత్తారం-2, మేడిపల్లి  కమాన్‌పూర్‌-6, కన్నాల-2 సహకార సంఘాల్లోనికి ప్రాదేశిక నియోజకవర్గాలకు 62 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో అత్యధికంగా ధర్మారం మండలం పత్తిపాక పీఏసీఎస్‌లో తొలి రోజు 11నామినేషన్లు దాఖలు కాగా, జూలపల్లి పీఏసీఎస్‌లో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు.


logo
>>>>>>