మంగళవారం 31 మార్చి 2020
Peddapalli - Feb 07, 2020 , 02:28:58

డీఐజీగా సత్యనారాయణ

డీఐజీగా సత్యనారాయణ

ఫెర్టిలైజర్‌సిటీ : రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ సీపీ వీ.సత్యనారాయణకు డీఐజీగా పదోన్నతి పొందారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్‌కుమార్‌ గురువారం పదోన్నతి ఉత్తర్వులను జారీ చేశారు. 2006 బ్యాచ్‌కు చెందిన పదోన్నతి ఐపీఎస్‌ అధికారుల్లో రామగుండం సీపీ వీ.సత్యనారాయణతోపాటు కార్తీకేయ, కే.రమేశ్‌నాయుడు, బి.సుమతి, ఎం.శ్రీనివాస్‌, వెంకటేశ్వరరావులు సైతం ఉన్నారు. పదోన్నతి పొందిన సీపీ సత్యనారాయణ రామగుండం సీపీగానే కొనసాగనున్నారు. సెప్టెంబర్‌ 26, 2018లో రామగుండం సీపీగా పదవీ బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం చేపట్టిన పలు చర్యలు సంస్కరణలతో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. కమిషనరేట్‌లో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలు చేసేందుకు సీపీ సత్యనారాయణ చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన ఫలితాలతో ప్రజలకు చేరువయ్యారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నేర పరిశోధన, నేరాల నియంత్రణలో మంచి ఫలితాలు సాధించారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్‌ అమలు చేసి తనదైన ముద్ర వేశారు. అంతేగాక రాష్ట్ర రాజధానిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా ట్రబుల్‌ షూటర్‌గా పేరుపొందిన సత్యనారాయణకు పిలుపు వస్తుంది.


అక్రమార్కులపై దూకుడు..

రామగుండం కమిషనరేట్‌ రెండో సీపీగా సెప్టెంబర్‌ 26, 2018లో బాధ్యతలు స్వీకరించిన సీపీ సత్యనారాయణ కమిషనరేట్‌ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘీక కార్యకలాపాలను అణచివేసి అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపారు. గతేడాదితో పోల్చితే నేరాల సంఖ్యను సైతం తగ్గించి తూర్పు డివిజన్‌లో దశాబ్దాల పాటు కొనసాగిన అక్రమ కలప రవాణాను అడ్డుకట్ట వేయడంతో పాటు నేరస్థుల ఓంట్లో దడ పుట్టిలా విధంగా 32 మందిపై పీడీ యాక్టు ప్రయోగించి కటకటాల్లోకి నెట్టారు. పారిశ్రామిక ప్రాంతంలో పోకిరీలను అడ్డుకట్ట వేసి ఆపరేషన్‌ చబుత్రా  లాంటి వినూత్న కార్యక్రమాలతో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు వరకు రోడ్లపై వీధుల్లో తిరిగే జులాయిలను అరికట్టారు. గతేడాది 7540 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది నేరాల సంఖ్యను 7 శాతంకు తగ్గించి 7023 కేసులు నమోదు చేశారు. అక్రమ గిరిగిర, ఫైనాన్స్‌, గుట్కా, మట్కా, గుడుంబా మహమ్మారిపై ప్రత్యేక దృష్టి సారించి సక్సెస్‌ అయ్యారు. టాస్క్‌ఫోర్సును పటిష్టం చేసి అక్రమ పీడీఎస్‌ బియ్యం రవాణాను, బొగ్గు స్క్రాప్‌ లాంటి వ్యాపారాలకు అడ్డుకట్ట వేశారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించి ఈ చలాన్‌ విధానంను ప్రవేశపెట్టారు. ఇన్సిడెంట్‌ ఫ్రీ ఎన్నికలు నిర్వహించి గతేడాది దేశంలోనే సంచలనం సృష్టించి పులి హంతకులను దొరకబట్టి ట్రైగర్‌ ఎండ్‌ అసోసియేషన్‌ నిర్వాహకులకు పంపించారు. 


బాధ్యత పెరిగింది.. 

రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించడం ఆనందం కలిగించింది. ఈ పదోన్నతితో నాకు మరింత బాధ్యతను పెంచింది. నేరాల నియంత్రణ, అసాంఘీక కార్యకలాపాలు అణచివేతకు మున్ముందు మరింత పకడ్బందీగా నిర్వహిస్తాను.

- సత్యనారాయణ, పోలీస్‌ కమిషనర్‌


logo
>>>>>>