సోమవారం 06 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 06, 2020 , 03:04:55

అభివృద్ధే లక్ష్యంగా ముందుకు..

అభివృద్ధే లక్ష్యంగా ముందుకు..

మంథనిటౌన్‌: పట్టణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ పేర్కొన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో ఆమె చైర్‌పర్సన్‌గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య పుట్ట శైలజ తన పదవీ బాధ్యతలను చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, తాను సర్పంచ్‌గా పని చేసిన సమయంలో అప్పటి ఎమ్మెల్యే పుట్ట మధు సహకారంతో రూ.50కోట్ల నిధులతో రోడ్లు, తాగునీరు, అండర్‌ డ్రైనేజీలు, స్ట్రీట్‌ లైన్లతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టానని గుర్తుచేశారు. పట్టణంలో ఇంకా కొన్ని మిగులు పనులున్నాయని, ఈ పనులన్నీ మున్సిపల్‌ పాలకవర్గం, అధికారులు, సిబ్బందితో కలిసికట్టుగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తామని చెప్పారు.  మున్సిపల్‌లో చేపట్టబోయే ప్రతీ కార్యక్రమాన్ని ప్రజలకు తెలిసే విధంగా మైక్‌ల ద్వారా అనౌన్స్‌మెంట్‌ చేయిస్తామన్నారు. శానిటేషన్‌, గ్రీనరీ పనుల్లో ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని ఉద్ఘాటించారు. ఉపాధి హామీ పథకం కోల్పోయిన వారందరికీ మెప్మా పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేలా కృష చేస్తామని హామీఇచ్చారు. తాను మంథని సర్పంచ్‌గా పనిచేసినప్పుడు ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించామనీ, ఇప్పుడు అదేస్ఫూర్తితో ముందుకుసాగుతామని ప్రకటించారు. అనంతరం పుట్ట శైలజను పలువురు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ గుట్టల మల్లికార్జునస్వామి, వైస్‌ చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌, కౌన్సిలర్లు గుండా విజయలక్ష్మి, శ్రీపతి బానయ్య, కుర్ర లింగయ్య, నక్క నాగేంద్ర, వీకే రవి, చొప్పకంట్ల హన్మంతు, టీఆర్‌ఎస్‌ నాయకులు కొత్త శ్రీనివాస్‌, బత్తుల సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. 


పెన్షన్‌ దరఖాస్తుపై తొలి సంతకం.. 

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన పుట్ట శైలజ తన తొలి సంతకాన్ని పెన్షన్‌ దరఖాస్తుపై చేశారు. పట్టణంలోని పద్మశాలీ వీధికి చెందిన గజ్జెల్లి శ్రీనివాస్‌ కుమారుడు గజ్జెల్లి సాయివిఘ్నేశ్వర్‌కు వికలాంగ పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తు పత్రాన్ని పుట్ట శైలజ వెంటనే పరిశీలించడంతోపాటు చైర్‌ పర్సన్‌గా తనతొలి సంతకాన్ని చేశారు. 


పుట్ట మధు దంపతులకు సన్మానం

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజలను ఎన్టీపీసీ విశ్రాంత ఉద్యోగులు బుధవారం ఘనం గా సన్మానించారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో పాటు మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పుట్ట శైలజ ఎన్నికల కావడంపై వారు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాళేశ్వర దేవస్థాన డైరెక్టర్‌ ఆరెల్లి సత్యనారాయణగౌడ్‌, ఎన్టీపీసీ విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆకుల రాంకిషన్‌, నాయకుడు సురేందర్‌గౌడ్‌, ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంత నాయకుడు వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. 


టీఆర్‌ఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో..

మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజను టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌, నాయకులు బుధవారం ఘనంగా సన్మానించారు. చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పుట్ట శైలజను ఆమె ఛాంబర్‌లో కొత్త శ్రీనివాస్‌తోపాటు టీఆర్‌ఎస్‌ నాయకులు శాలువా కప్పి సన్మానించడంతో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలున్నారు. 


logo