బుధవారం 08 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 06, 2020 , 02:27:44

మేడారం తరలుతున్న భక్తులు

మేడారం తరలుతున్న భక్తులు

మంథనిటౌన్‌: మేడారం మహాజాతరకు మంథని నుంచి భక్తజనం తరలుతున్నారు. బుధవారం పట్టణంతోపాటు మండలలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు సమ్మక్క-సారలమ్మ జాతరకు తరలివెళ్లేందుకు మంథని బస్టాండ్‌కు భారీగా చేరుకున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు భక్తుల రాకపోకలతో బస్టాండ్‌ ప్రాంగణం కిటకిటలాడింది. గురు, శుక్రవారాల్లో తల్లీబిడ్డలిద్దరూ గద్దెలపై కొలువుదీరిన మహాఘట్టాన్ని వీక్షించేందుకు భక్తజనం ఉత్సాహంగా మేడారం దారిపట్టారు. భక్తుల కోసం ఆర్టీసీ సంస్థ భారీగా బస్సులను సమకూర్చడంతో వచ్చిన భక్తులు వచ్చినట్లే బస్సులకోసం ఎదురు చూడకుండా పయనమవుతున్నారు. భక్తుల కోసం వాసవీ క్లబ్‌ ఆధ్వర్యంలో రెండు రోజులుగా అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. బస్సులు, ఆర్టీసీ సిబ్బంది అన్నదాన సేవాలను వినియోగించుకుంటున్నారు.  

కమాన్‌పూర్‌: గుండారం గ్రామంలో సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభమైంది. ఇందులో భాగంగా బుధవారం  కోయ పూజారులు గ్రామంలోని రాజేంద్రనగర్‌ నుంచి సంప్రదాయపద్ధతిలో సారలమ్మను గద్దెకు డప్పుచప్పుళ్ల మధ్య వైభవంగా తీసుకవచ్చారు. సారలమ్మ గద్దెకు చేరుకోగానే భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చస్త్రశారు. అంతకుముందు సమ్మక్క-సారలమ్మ జాతర ప్రాంగణాన్ని ఎంపీపీ రాచకొండ లక్ష్మి, ఎంపీడీఓ వెంకటేష్‌జాదవ్‌, తాసిల్దార్‌ పాల్‌సింగ్‌, ఎంపీఓ వాజిద్‌ పరిశీలించారు.

ముత్తారం: ఖమ్మంపల్లి పంచాయతీలోని సందరెళ్లిలో, మైదంబండ గ్రామంలోని గుట్టపైన బుధవారం సారలమ్మను తీసుకువచ్చారు.  గురువారం సమ్మక్క గద్దెలపైకి చేరుకోనుందని జాతర కమిటీ సభ్యులు తెలిపారు. ఈ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు మొక్కలు చెలించుకుంటారని నిర్వాహకులు తెలిపారు.  


logo