బుధవారం 01 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 05, 2020 , 02:26:36

జనగామ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

జనగామ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

గోదావరిఖని,నమస్తే తెలంగాణ: జనగామ సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రజలు తరలిరావాలని  ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. మంగళవారం గోదావరిఖని పట్టణంలోని గోదావరి నదీ తీరాన నిర్వహిస్తోన్న సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లను మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌, డిప్యూ టీ మేయర్‌ నడిపెల్లి అభిషేక్‌రావులతో కలిసి ఆయ న పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ,  మినీమేడారంగా పిలువబడుతున్న జనగామ సమ్మక్క, సారలమ్మ జాతరకు ఏర్పాట్లు సర్వంసిద్ధం చేసామని తెలిపారు. సింగరేణి సంస్థ, ఎన్టీపీసీ సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న జాతరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుం డా తగిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.  కార్యక్రమంలో కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్‌, దాతు శ్రీనివాస్‌, సాగం టి శంకర్‌ నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, గొలుసు నాగరాజు, సంతోష్‌రావు, రాజేందర్‌, జాతర కమిటీ బాధ్యులు బంగారి రాజయ్య, కనుకయ్య, మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మల్లేశం పాల్గొన్నారు.


లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ   

దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ వంటి పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతోందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో 14మందికి కల్యాణలక్ష్మి, 42 మందికి షాదీముబారక్‌ ద్వారా మొత్తం రూ. 56 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే మాట్లాడారు.   పేద ప్రజలు జీవితాంతం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారన్నారు. కార్యక్రమంలో మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ నడిపెల్లి అభిషేక్‌రావు, కార్పొరేటర్లు అడ్డాల స్వరూప రామస్వామి, పాతపెల్లి లక్ష్మీఎల్లయ్య, కుమ్మరి శ్రీనివాస్‌, రమణారెడ్డి, రాకం శ్రీమతి వేణు, శంకర్‌నాయక్‌, సాగంటి శంకర్‌, జంజర్ల మౌనిక రాజు, మహాలక్ష్మి తిరుపతి, కొమ్ము వేణుగోపాల్‌, పాముకుంట్ల భాస్కర్‌, నాయకులు గంగ శ్రీనివాస్‌, తోడేటి శంకర్‌గౌడ్‌, అచ్చ వేణు, అడప శ్రీనివాస్‌, నూతి తిరుపతి, సిరాజొద్దీన్‌ పాల్గొన్నారు.


logo
>>>>>>