శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 04, 2020 , 01:49:04

తాగునీటికే ప్రథమ ప్రాధాన్యం

తాగునీటికే ప్రథమ ప్రాధాన్యం

గోదావరిఖని టౌన్‌ : రామగుండం కార్పొరేషన్‌ పరిధిలో తాగునీటి సౌకర్యానికే ప్రథమ ప్రాధాన్యమిస్తానని నగర పాలక సంస్థ కమిషనర్‌, ఐఏఎస్‌ అధికారి పీ ఉదయ్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు కార్పొరేషన్‌ కార్యాలయం లో ప్రస్తుత కమిషనర్‌ బోనగిరి శ్రీనివాస్‌ నుంచి ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్‌ పరిధిలో తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత కింద తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ తాగునీరు అందేలా సిబ్బంది కూడా బాధ్యతగా పని చేయాలని ఆదేశించారు. రెండో ప్రాధాన్యత కింద పరిశుభ్రత, వీధి లైట్లను ఏర్పాటు చేయడం లాంటి పనులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. మున్సిపాల్టీల్లో పరిశుభ్రత కీలకమైందని చెప్పారు. ప్రతి వీధిలో వెలుతురు ఉండేలా లైట్లను ఏర్పాటు చేస్తామన్నారు. బల్దియా కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన పీ ఉదయ్‌కుమార్‌కు మేయర్‌ అనిల్‌కుమార్‌ శుభాకాంక్షలు తెలిపారు. నగర అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఇంజినీర్లు మహేందర్‌, సుచరణ్‌, మాధవి, ఆర్‌ఐ శంకర్‌ రావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కిశోర్‌కుమార్‌ ఉన్నారు. 


logo