గురువారం 09 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 04, 2020 , 01:47:05

టీఆర్‌ఎస్‌తోనే సంక్షేమం

టీఆర్‌ఎస్‌తోనే సంక్షేమం

మంథనిటౌన్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీతోనే గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు సాధ్యమవుతుందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ స్పష్టం చేశారు. మల్హర్‌ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు, నాయకులు దాదాపు 100 మంది పుట్ట మధు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, భూపాలపల్లి జడ్పీ చైర్‌పర్సన్‌ అలుగు వర్షిణి కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరూ ఆకర్షితులై టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా మంది టీఆర్‌ఎస్‌లో చేరగా, ఇతర పార్టీలకు చెందిన మరికొంత మంది నాయకులు కూడా పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గ్రామాల్లోని కుల వృత్తులకు ప్రోత్సాహం, మౌలిక వసతులు, సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు కేవలం టీఆర్‌ఎస్‌ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో సీఎం కేసీఆర్‌ ప్రజల మనస్సుల్లో చేరగని ముద్ర వేసుకున్నారని, మున్ముందు ఏ రాజకీయ పార్టీలకు కూడా భవిష్యత్తు ఉండదన్నారు. కొయ్యూర్‌ సర్పంచ్‌ సిద్ధ లింగమూర్తి, తాడిచర్ల ఎంపీటీసీ రావుల కల్పన మొగిలి, కో-ఆప్షన్‌ సభ్యుడు ఆయూబ్‌ఖాన్‌, కొయ్యూర్‌ వార్డు సభ్యులు మీసాల మల్లయ్య, జంగ ధర్మక్క, ముంజం శిరీష, గొట్టం లక్ష్మీనారాయణ, భూక్య నరేష్‌, సరితతో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సుంకు వెంకటి, యూత్‌ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరగా, మంథని, మల్హర్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


logo