గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 04, 2020 , 01:46:26

ప్రజల ఆదరణ మరువలేను

ప్రజల ఆదరణ మరువలేను

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ‘నేను నా జీవితంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన రోజులను మర్చిపోలే ను.. ఇక్కడి ప్రజల ఆదరాభిమానాలు.. అధికారుల పనితీరు.. నాకు.. ఈ జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపును తీసుకువచ్చాయి.. ఇంత గొప్పరోజులు మళ్లీ వస్తాయని కూడా ఊహించలేను.. ఇక్కడి వారు చూపిన అభిమానాన్ని ఎన్నటికీ మర్చిపోలేను’అని కలెక్టర్‌గా పనిచేసి ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా బదిలీపై వెళ్తున్న శ్రీదేవసేన అన్నారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో చివరగా అధికారులను కలుసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లాతో తనకు ఏర్పడిన అనుబంధం విడదీయరానిదని వివరించారు. జిల్లావాసులు కష్టాల్లో ఉన్న.. ఎన్ని బాధల్లో ఉన్నా అధికారులుగా మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని జిల్లాపై తన అభిమానాన్ని చాటుకున్నారు. 

పాలనలో చెరగని ముద్ర 

రెండో కలెక్టర్‌గా 2018 జనవరి 8న బాధ్యతలు స్వీకరించిన శ్రీదేవసేన పాలనలో చెరగని ముద్ర వేసుకున్నా రు. పది జిల్లాల తెలంగాణ రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిపాలన సౌలభ్యం కోసం చిన్న జిల్లాలుగా ఏర్పా టు చేయగా వాటిని ఎలా అభివృద్ధి, సంక్షేమం వైపు పరుగులు పెట్టించవచ్చో కలెక్టర్‌ శ్రీదేవసేన చూపించారు. స్వచ్ఛతపై ఆమె సమరాన్ని మొదలు పెట్టారు. అప్పటికే పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రవేశపెట్టిన, స్వచ్ఛత, ప్లాస్టిక్‌ రహిత గ్రామాల ఆవిర్భావాన్ని శ్రీదేవ సేన మరింత ముందుకు తీసుకువెళ్లడంతో జిల్లా దేశంలోనే నెంబర్‌-1 పలు అవార్డులను దక్కించుకున్నది. అధికారులు, ప్రజా ప్రతినిధుల సమష్టికి కృషికి ఫలితం ఎలా ఉంటుందో నిరూపించింది. జిల్లాకు స్వచ్ఛ సర్వేక్షణ్‌-2018, స్వచ్ఛ సుందర సౌచాలయ్‌, స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌-2019, మూడు సార్లు జాతీయ అవార్డులు వచ్చాయి.  స్వచ్ఛత దర్పణ్‌-2020 పెద్దపల్లి జిల్లాకు నాల్గో జాతీయ అవార్డుగా రికార్డుకెక్కింది. స్వచ్ఛతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కార్యక్రమంలో జిల్లా ఆది నుంచి తన ప్రత్యేకతను చాటు కుంటూనే వచ్చింది. ఆమె స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌-2019అవార్డును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుంచి అందుకున్నారు. ఇలా ఒకవైపు జిల్లాకు అవార్డుల పంట పండిస్తూనే రాష్ట్రంలో మహిళలు, యువతులు, బాలికలపై కొనసాగుతున్న అరాచకాలను అరికట్టేందుకు కేరళ మార్షల్‌ ఆర్ట్స్‌ కళరిపయ్యట్టును ప్రజలకు పరిచయం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు శిక్షణ ఇప్పించి వారిలో ఆత్మైస్థెర్యాన్ని నింపేందుకు కృషి చేశారు. శ్రీదేవసేన కలెక్టర్‌గా జిల్లా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.  


logo