గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 04, 2020 , 01:45:52

ప్రజాప్రతినిధులకు సన్మానం

ప్రజాప్రతినిధులకు సన్మానం

రాంమందిర్‌ ఏరియా: నియోజకవర్గంలోని యాదవ ప్రజాప్రతినిధులను అఖిల భారత యాదవ మహాసభ రామగుండం కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సోమవారం స్థానిక సం ఘం కార్యాలయంలో ఇటీవల ఎన్నికైన ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డుమెంబర్లు,  కార్పొరేటర్లను పూలమాలలు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో యాదవ మహాసభ నాయకులు గుంపుల ఓదెల్‌, లింగన్నయాదవ్‌, గుంపుల తిరుపతి, గట్ట య్య, ఆవుల రాజేశ్‌, ఆర్‌కే యాదవ్‌, రమేశ్‌, సమ్మ య్య, కుమారస్వామి, గోపాల కృష్ణ, మురళీధర్‌, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేటర్‌కు సన్మానం

జ్యోతినగర్‌: మూడో డివిజన్‌ కార్పొరేటర్‌ కుమ్మరి శ్రీనివాస్‌ శారదను సోమవారం న్యూపోరట్‌పల్లిలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఉపాధ్యాయులు పూలమాలలు వేసి శాలువలతో సత్కరించారు. పిల్లలకు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం కార్పొరేటర్‌ అంగన్‌వాడీ కేంద్రంలో అక్షరభ్యాసం, బాల అమృత పథకం ద్వారా పిల్లలకు కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ నాయకులు బుర్ర శంకర్‌ గౌడ్‌, గోశిక శ్రీను, నారాయణ, మల్లేశ్‌, రాజు, మల్లికార్జున్‌ గౌడ్‌, సిద్ధ శేఖర్‌, పాఠశాల హెచ్‌ఎం స్వప్న, అంగన్‌వాడీ కేంద్రం టీచర్‌ శ్రీదేవిరెడ్డి, తదితరులు ఉన్నారు. కాగా మూడో డివిజన్‌లో సోమవారం కార్పొరేటర్‌ కుమ్మరి శ్రీనివాస్‌ బస్తీబాట కార్యక్రమాన్ని చేపట్టారు. అన్నపూర్ణకాలనీ, మేరకాలనీలో, న్యూపోరట్‌పల్లిలో ఇంటింటా తిరిగిన సమస్యలను తెలుసుకున్నారు. మిషన్‌  భగీరథ  అధికారులు, ఎల్‌ అండ్‌ టీ  ఇంజినీర్‌ పాషాతో కలిసి పర్యటించిన కార్పొరేటర్‌ ఇంటింటా మిషన్‌ భగీరథ నల్లాలు లేని వారిని గుర్తించారు. వెంటనే నల్లాలు  ఏర్పాటు చేయాలని అధికారులు తెలిపారు. 


logo
>>>>>>