బుధవారం 08 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 04, 2020 , 01:41:45

మొదలైన సహకార సందడి

మొదలైన సహకార సందడి

అంతర్గాం: ఈనెల 15న జరిగే సహకార సంఘం ఎన్నికలకు చెందిన డైరెక్టర్ల అభ్యర్థుల రిజర్వేషన్లను సోమవారం ప్రభుత్వం ప్రకటించడంతో మేడిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని ఆశావహుల్లో ఉత్సా హం పెరిగింది. నియోజకవర్గ పరిధిలో ఒకేఒక్క సహకార సంఘం ఉండగా సంఘం పరిధిలోని ఉమ్మడి రామగుండం మండలంలోని 29 గ్రామాల్లో కలిసి 13 డైరెక్టర్‌ స్థానాలకు గానూ మొత్తం 1565 ఓటర్లున్నారు. ఒక్కొక్క డైరెక్టర్‌ పరిధిలో 120మంది ఓటర్లుంటారనీ, సహకార సంఘం కార్యదర్శి వైద్య రమేశ్‌ వివరించారు.

రిజర్వేషన్ల వివరాలు..

1వ డైరెక్టర్‌ (ఓసీ-మహిళ), 2వ డైరెక్టర్‌ (ఓసీ), 3వ డైరెక్టర్‌ (ఓసీ), 4వ డైరెక్టర్‌ (ఎస్సీ-మహిళ), 5వ డైరెక్టర్‌ (బీసీ), 6వ డైరెక్టర్‌ (బీసీ), 7వ డైరెక్టర్‌ (ఓసీ), 8వ డైరెక్టర్‌ (ఓసీ), 9వ డైరెక్టర్‌ (ఎస్టీ), 10వ డైరెక్టర్‌ (ఎస్సీ), 11వ డైరెక్టర్‌ (ఓసీ), 12వ డైరెక్టర్‌ (ఓసీ), 13వ డైరెక్టర్‌ (ఓసీ)గా రిజరేషన్‌ ఖరారైంది. కాగా, ఈనెల 6,7,8 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 9న నామినేషన్ల పరిశీలన, 10న ఉపసంహరణ, 15న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు డైరెక్టర్ల స్థానానికి ఎన్నికలు నిర్వహించి సాయంత్రం 5 గంటలకు డైరెక్టర్ల ఫలితాలు, 16న చైర్మన్‌ ఎన్నిక ఉంటుందని సహకార సంఘం కార్యదర్శి వైద్య రమేశ్‌ తెలిపారు. 


logo