శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 03, 2020 , 03:42:31

స్వరాష్ట్రంలో విద్యారంగానికి మంచిరోజులు

స్వరాష్ట్రంలో విద్యారంగానికి మంచిరోజులు
  • ప్రభుత్వ విద్యాలయాల్లో సమూల మార్పులు
  • కార్పొరేట్‌కు దీటుగా విద్య, వసతులు కల్పిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే
  • ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
  • తేలుకుంట, భూపతిపూర్‌లోని కస్తూర్బాల్లో అకాడమిక్‌ బ్లాక్‌ల పనులకు శంకుస్థాపన
  • ఒక్కో చోట 2.05కోట్లతో నిర్మాణం

జూలపల్లి : స్వరాష్ట్రంలో విద్యారంగానికి మంచి రోజులు వచ్చాయని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. తేలుకుంటలోని కస్తూర్బాగాంధీ పాఠశాల ఆవరణలో ప్రభుత్వం అకాడమీ భవన సముదాయం నిర్మించేందుకు ‘సమగ్ర శిక్షా అభియాన్‌' పథకం ద్వారా 2 కోట్ల 5 లక్షల నిధులు మంజూరు చేసింది. అలాగే రామప్ప గుట్టల్లో మి నీ కల్యాణ మండపం నిర్మించేందుకు ప్రభుత్వం 23 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులు కేటాయించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం దాసరి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ విద్యాలయాల్లో సమూల మార్పులు తీసుకువచ్చారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తం గా రెసిడెన్సీ పాఠశాలలు పెద్దయెత్తున ఏర్పా టు చేస్తున్నారని తెలిపారు. 


ప్రతి కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఇంటర్‌ విద్యార్థులకు తరగతి గదుల కొరత తీర్చేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ పక్కా భవనాలు నిర్మిస్తుందని వెల్లడించారు. కార్పొరేట్‌ విద్యాల యాలకు దీటుగా విద్య, వసతులు కల్పిస్తున్న ఘనత సీఎందేనని ప్ర కటించారు. ఇక్కడ జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, జడ్పీ సభ్యుడు బొద్దుల లక్ష్మణ్‌, సర్పంచ్‌ సొల్లు పద్మ, ఎంపీటీసీ సభ్యుడు కత్తెర్ల శ్రీనివాస్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ ఆసంపెల్లి సరిత, ఉప సర్పంచ్‌ చొప్పరి నర్సింగం, పాఠశాల ప్రత్యేకాధికారి వరుణ్‌జ్యోతి, డీఈ వెన్సెంట్‌రావు, ఏఈ శ్రవణ్‌, నాయకులు గొడిశెల రవి, సొల్లు శ్యామ్‌, చొప్పరి శేఖర్‌, మెండె పోశాలు, చిప్ప శ్రీకాంత్‌, చిప్ప రమేశ్‌, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


నాణ్యమైన విద్య లక్ష్యం..

సుల్తానాబాద్‌రూరల్‌: విద్యార్థులను నాణ్యమైన విద్యనందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని  ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తెలిపారు.  భూపతిపూర్‌ కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఆదివారం అకాడమిక్‌ బ్లాక్‌ నిర్మా ణం కోసం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2.05 కోట్లతో అకాడమిక్‌ బ్లాక్‌ నిర్మాణంతో పాటు, బోర్‌వెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులను కల్పించి నాణ్యమైన విద్యనందించే దిశగా ప్రభుత్వం పని చేస్తున్నదని వివరించారు.  కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, సర్పంచ్‌ కవ్వంపల్లి జమున, ఎంపీటీసీ సభ్యురాలు పులి అనూష, ఉప సర్పంచ్‌ సందీప్‌రావు, నాయకులు పోచమల్లు, బల్మూరి సత్యనారాయణరావు,  తిరుపతి, లింగమూర్తి, రాజు, కనుకయ్య, వెంకటస్వామి, శ్రీనివాస్‌, ఎస్‌ఓ స్వప్న తదితరులు పాల్గొన్నారు. 


logo