గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 01, 2020 , 02:14:25

అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా

అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా
  • సుల్తానాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సునీత
  • ఎమ్మెల్యే దాసరి సమక్షంలో బాధ్యతల స్వీకరణ

సుల్తానాబాద్‌ : ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మంత్రి కేటీఆర్‌ సహకారంతో పట్టణ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని సుల్తానాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముత్యం సునీత స్పష్టం చేశారు. సుల్తానాబాద్‌ బల్దియా చైర్‌పర్సన్‌గా ముత్యం సునీత, వైస్‌ చైర్‌పర్సన్‌గా బిరుదు సమతతోపాటు పాలకవర్గ సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యే దాసరి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. లక్ష్మన్‌శర్మ పూజ లు నిర్వహించగా, ఎమ్మెల్యే దాసరి పాలకవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఏర్పాలైన సుల్తానాబాద్‌ మున్సిపాలిటీని మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దాలనీ, అందుకోసం తన సహాయసహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. నూతన మున్సిపల్‌ చట్టంతో సుల్తానాబాద్‌ రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. పట్టణాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తున్నదనీ, ఇప్పటీకే రూ.5 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ పనులు చేపడుతున్నామని తెలిపారు. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీకి మరో రూ.10 కోట్లు ఇచ్చేందుకు మం త్రి కేటీఆర్‌ హమీ ఇచ్చారని గుర్తు చేశారు. 


పాలకవర్గ సభ్యు లు పార్టీలకతీతంగా పనిచేస్తూ, సమష్టిగా అభివృద్ధి చేయాలని సూచించారు. పెం డింగ్‌ పనులను పూర్తి చేయించాల్సిన బాధ్యత పాలకవర్గంపైనే ఉన్నదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అర్హులందరికీ అందే లా కృషి చేస్తానని బల్దియా చైర్‌పర్సన్‌ సునీత పేర్కొన్నారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌రావు, మాజీ జడ్పీటీసీలు అయిల రమేశ్‌, గుర్రాల మల్లేషం, మాజీ ఎంపీపీ పాల రామారావు, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ బుర్ర శ్రీనివాస్‌, సింగిల్‌విండో చైర్మన్‌ శ్రీగిరి శ్రీనివాస్‌, నాయకులు ము త్యం రమేశ్‌, బిరుదు సమత, పారుపెల్లి జ్ఞానేశ్వరి, గుర్రాల శ్రీనివాస్‌, అనుమాల అరుణ, కూకట్ల గోపి, రెవెల్లి తిరుపతి, తిప్పారపు దయాకర్‌, సూరశ్యాం, పసెడ్ల మమత, సభ్యులు దున్నపోతుల రాజయ్య, ఉట్ల వరప్రదీప్‌, సిద్ద కనుకయ్య, గోట్టం లక్ష్మి, చింతల సునీత, కోట రాంరెడ్డి, డాక్టర్‌ కలీం, సర్వర్‌, నరహరి వెంకటేశ్వర్లు, సాజిత, మాజిద్‌ పాల్గొన్నారు. 


logo
>>>>>>