శనివారం 28 మార్చి 2020
Peddapalli - Feb 01, 2020 , 02:11:29

కోరుకంటి ఎత్తు బంగారం

కోరుకంటి ఎత్తు బంగారం
  • ఎమ్మెల్యేగా గెలవాలని ఎన్నికల ముందు
  • కాలనీలో చెల్లించిన చందర్‌
  • టీఆర్‌ఎస్‌ యువజన నాయకుడి మొక్కు

యైటింక్లయిన్‌ కాలనీ : రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, శుక్రవారం సమ్మక్క - సారలమ్మ మొక్కు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యేగా కోరుకంటి గెలుపొందితే, ఆయన ఎత్తు బంగారం సమర్పిస్తానని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మొక్కుకున్నట్లు టీఆర్‌ఎస్‌ యువజన నాయకుడు కుమార్‌నాయక్‌ తెలిపారు. చందర్‌ విజయం సాధించడంతో మహా జాతరను పురస్కరించుకొని ఎమ్మెల్యే ఎత్తు బంగారాన్ని జోకి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కోరుకంటి మాట్లాడుతూ కార్యకర్తల, ప్రజల ఆశీస్సులతోపాటు సమ్మక్క-సారలమ్మ దీవెనలతో ఎమ్మెల్యేగా విజయం సాధించాననీ, అందరి రుణం తీర్చుకునేందుకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. సమ్మక్క-సారలమ్మ జాతర కోసం గోదావరిఖనిలోని గద్దెల వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ సాగంటి శంకర్‌, కొమ్ము గట్టయ్య, సిద్ద భాస్కర్‌, పాశం శ్రీను, కండె సాగర్‌, బదావత్‌ శారద, రవి, అర్జున్‌, మణికంఠ, కుమార్‌యాదవ్‌, రమేశ్‌నాయక్‌  తదితరులు పాల్గొన్నారు. 


logo