శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 01, 2020 , 02:10:54

నర్సరీ పనుల్లో వేగం పెంచాలి

నర్సరీ పనుల్లో వేగం పెంచాలి

కాల్వశ్రీరాంపూర్‌ : నర్సరీ పనుల్లో వేగం పెంచాలని  సంబంధిత అధికారులను జడ్పీ సీఈఓ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పెగడపల్లి, మంగపేట, కూనారం గ్రామాల్లో నర్సరీలో పెరుగుతున్న మొక్కలను శుక్రవారం జడ్పీ సీఈఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ, బ్యాగ్‌ కన్‌వర్షన్‌ పనులు వెంటనే పూర్తి చేయించాలని ఆదేశించారు. మొక్కల సంరక్షణ బాధ్యత ఈజీఎస్‌ సిబ్బందిపై ఉందన్నారు. నర్సరీల్లో పనులు, పెరుగుతున్న మొక్కలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కూనారంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి, ప్రజలకు వై ద్యం అందిస్తున్న వివరాలు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి, మారుమూల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మంగపేటలో వర్మీకంపోస్ట్‌ ఎరువుల తయారీని పరిశీలించారు.కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్‌, ఎంపీడీఓ కిషన్‌, సర్పంచులు డొనికెన విజయ, బుర్ర మంగ, అరెల్లి సుజాత, ఈజీస్‌ సిబ్బంది ఆది శ్రీనివాస్‌రావు, ఎంబాటి రంజిత్‌, ఆయా గ్రామాల ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు,  టీఆర్‌ఎస్‌ నాయకులు డొనికెన మొగిళి, బుర్ర సదానందం, బిట్టు తదితరులు ఉన్నారు.  


మొక్కల పరిశీలన

ఓదెల: గుండ్లపల్లిలోని వన నర్సరీని పెద్దపల్లి డీఎల్‌పీఓ దేవకిదేవి సందర్శించారు. నర్సరీలో మొక్కల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెల్సుకున్నారు. ప్రజ లకు అవసరమైన మొక్కలను నర్సరీల్లో పెంచాలని కోరారు. హరితహారం కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకే గ్రామానికో నర్సరీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వెంట సర్పంచ్‌ పులుగు తిరుపతిరెడ్డి, ఎంపీడీఓ సత్తయ్య, ఏపీఓ రజీ అహ్మద్‌ ఖాన్‌, ఈజీఎస్‌ ఎఫ్‌ఏ మల్లయ్య తదితరులున్నారు.


logo