బుధవారం 01 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 01, 2020 , 02:10:18

ఆటో బోల్తా.. యువకుడి మృతి

ఆటో బోల్తా.. యువకుడి మృతి

గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లిలోని ఎస్సీ కాలనీ సమీపంలో శుక్రవారం రాత్రి అదుపుతప్పి ఆటో బోల్తాపడింది. ఈ సంఘటనలో కారం నర్సింగం(32) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గొల్లపల్లి మండలకేంద్రంలో గుండ స్వామి అనే వ్యక్తి ఇంట్లో శుభకార్యానికి హాజరై వెళ్తుండగా అదుపుతప్పి ఆటో బోల్తాపడంది. దీంతో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూరుకు చెందిన కారం నర్సింగం అక్కడికక్కడే మృతిచెందగా, మంచిర్యాల జిల్లా దండెపెల్లికి చెందిన సత్తయ్య, వెంకటేశ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని జగిత్యాలకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ కేసు నమోదు చేశారు.


logo
>>>>>>