మంగళవారం 31 మార్చి 2020
Peddapalli - Feb 01, 2020 , 02:04:43

వాహనదారులు హెల్మెట్‌ ధరించాలి

వాహనదారులు హెల్మెట్‌ ధరించాలి

పెద్దపల్లి టౌన్‌: ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ వాడాలనీ, రోడ్డు ప్రమాదాల నివారణకు అందరూ పాటుపడాలనీ పెద్దపల్లి జోన్‌ డీసీపీ రవీందర్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ట్రినిటీ డిగ్రీ కళాశాల విద్యార్థులతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. విద్యార్థులు నృత్య రూపంలో హెల్మెట్‌ ధరించి వాహనాలు నడుపాలనే సందేశమిచ్చే విధంగా ప్రదర్శన ఇచ్చారు. అనంతరం డీసీపీ రవీందర్‌, ట్రాఫిక్‌ ఏసీపీ రాంరెడ్డి, జిల్లా రవాణాశాఖాధికారి అఫ్రిన్‌ సిద్ధిఖీ మాట్లాడుతూ, వాహనదారులు ట్రాఫిక్‌ నియమాళపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మద్యం తాగి, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడుపడం మానుకోవాలని హెచ్చరించారు. విద్యార్థులకు రోడ్డు నియమాళపై అవగాహన ఉండాలని పేర్కొన్నారు. 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా విద్యార్థుల ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకోవడంతోపాటు సందేశం ఇచ్చే విధంగా విద్యార్థుల ప్రతిభను అధికారులు అభినందించారు. దేశవ్యాప్తంగా ప్రతిగంటకు 17మంది రోడ్డు ప్రమాదాల రూపంలో మృత్యువాత పడుతున్నారని ప్రమాదాల నివారణకు విద్యార్థులు, యువత, ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ నియమా వివరించారు. అంతకుముందు పోలీసులతో కలిసి డీసీపీ శాంతికి చిహ్నమైన పావురాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ హబీబ్‌ ఖాన్‌, ట్రాఫిక్‌ సీఐ కోట బాబురావు, సీఐలు ప్రదీప్‌కుమార్‌, ఎంవీఐ శ్రీనివాస్‌, ఏఎంవీఐ నాగలక్ష్మి, ఎస్‌ఐ ఉపేందర్‌రావు, ట్రినిటీ డిగ్రీ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ నీతారెడ్డి, విద్యార్థులు, డ్రైవర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 


logo
>>>>>>