ఆదివారం 29 మార్చి 2020
Peddapalli - Jan 31, 2020 , 03:21:58

కంగ్రాట్స్‌ మధూకర్‌..

కంగ్రాట్స్‌ మధూకర్‌..
  • కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న పుట్ట మధు - శైలజ దంపతులు
  • పుట్ట దంపతులకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అభినందనలు
  • కేటీఆర్‌ను కలిసిన జడ్పీ చైర్మన్‌, మంథని బల్దియా చైర్‌పర్సన్‌, పాలకవర్గ సభ్యులు, నాయకులు

మంథని రూరల్‌: ‘కంగ్రాట్స్‌ మధూకర్‌..మంథని మున్సిపాల్టీపై టీఆర్‌ఎస్‌ పార్టీ 13స్థానాలకు 11 కైవసం చేసుకోవడం సంతోషకరం’ అంటూ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ను అభినందించారు. గురువారం మంత్రి కల్వకుంట తారకరామారావును హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ మర్యాదపూర్వకంగా కలిశారు. 


ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, మంథని మున్సిపాల్టీపై గులాబీ జెండా ఎగురవేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకిచ్చిన పూర్తి మెజార్టీని వమ్ము చేయకుండా పనిచేయాలని సూచించారు. నూత న మున్సిపల్‌ చట్టం ప్రకారం పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని పేర్కొన్నారు. మంథని అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పట్టణ రూపరేఖలు మార్చాలని చెప్పారు. 


నూతన మున్సిపాల్టీ పాలకవర్గం ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలని పేర్కొన్నారు. మున్సిపాల్టీ అభివృద్ధికి తగినన్ని నిధులను మంజూరు చేస్తామని  చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఇచ్చిన హామీల అమలను చేయాలని, ఇందుకు జడ్పీ చైర్మన్‌, మంత్రి కొప్పుల సహాయ, సహకారాలు తీసుకోవాలని మంథని మున్సిపల్‌ చైర్మపర్సన్‌ పుట్ట శైలకు సూచించారు. అన్నిఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, ఎన్నికల ఇన్‌చార్జి కర్ర శ్రీహరి, మాజీ జడ్పీటీసీ చల్లా నారాయణరెడ్డి, కౌన్సిలర్లున్నారు. 


logo