గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 29, 2020 , 04:24:57

సమ్మక్క జాతరకు విస్తృత ఏర్పాట్లు

సమ్మక్క జాతరకు విస్తృత ఏర్పాట్లు

గోదావరిఖనిటౌన్‌: జనగామ గ్రామంలో ఏటా నిర్వహించే సమ్మక్క-సారలమ్మ జాతరకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామనీ,  మినీ మేడారంగా జరుపుకుందామనీ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ స్పష్టంచేశారు. మంగళవారం ఆయన మేయర్‌ డాక్టర్‌ బంగి అనిల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావుతో సమ్మక్క గద్దెలను సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడు తూ, జాతరకు రూ.2.5 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. మేడారం తరహా లో కోల్‌బెల్టు ఏరియాకు చెందిన నాలుగు జిల్లాల నుంచి ఇక్కడికి తరలివస్తారని చెప్పారు. ఫిబ్రవరి 5,6,7,8 తేదీల్లో సమ్మక్క-సారలమ్మ జాతర ఉండగా 6,7తేదీల్లో లక్షలాది మంది హాజరై వనదేవతలను దర్శించుకుంటారని పేర్కొన్నారు. 

ఉభయ జిల్లాలతోపాటు సమీపంలోని మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌ ప్రాంతాల ప్రజలు కూడా ఈ కోల్‌బెల్టు జాతరలో పాల్గొంటారన్నారు. కాళేశ్వరం సుందిళ్ల బ్యారేజీ బ్యాక్‌ వాటర్‌ను తరలించి నీరు నిల్వ కాకుండా చేస్తున్నారన్నారు.  

పరిశ్రమల చేయూత

సమ్మక్క జాతరకు జెన్‌కో వారు ఎలక్ట్రికల్‌ పోల్స్‌, వైరింగ్‌, వీధిదీపాలతోపాటు కరెంటు సరఫరా చేస్తున్నారని ఎమ్మెల్యే చందర్‌ తెలిపారు. ఎన్టీపీసీ యాజమాన్యం జాతర ప్రాంతంలో గద్దెల వద్ద ఫ్లోరింగ్‌, అవసరమైన సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు. రూ.2కోట్లతో పూర్తిగా పరిసర ప్రాంతాల్లో ఓబీ మట్టి  పోయిస్తున్నట్లు ఆయ న వెల్లడించారు.

స్వచ్ఛతకు ప్రాముఖ్యత: మేయర్‌  

జాతరలో స్వచ్ఛత, పరిశుభ్రతకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తామని రామగుండం మేయర్‌ డాక్టర్‌ బంగి అనిల్‌కుమార్‌ తెలిపారు. మేయర్‌గా పదవీ స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన తొలుత సమ్మక్క-సారలమ్మ గద్దెలను సందర్శించారు. ఎమ్మెల్యే సూచనల మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్య లు తీసుకుంటామన్నారు. ప్రజలంతా సహకరించి పరిశుభ్రత పాటించాలని డిప్యూటీ మేయర్‌ నడిపెల్లి అభిషేక్‌రావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు మెతుకు దేవరాజ్‌, అడప శ్రీనివాస్‌ తదితరులున్నారు. 


logo
>>>>>>