మంగళవారం 31 మార్చి 2020
Peddapalli - Jan 29, 2020 , 04:21:23

చివరి ఆయకట్టుకూ నీరందిస్తాం

చివరి ఆయకట్టుకూ నీరందిస్తాం

మంథనిటౌన్‌: ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు వరకూ సాగునీరు అం దే విధంగా రైతులందరూ సహకరించాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ కోరారు. మంగళవారం పట్టణంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి ఎకరాకు సాగునీరు అందించి పుష్కలంగా పంటలు పండేలా చూడటమే సీఎం కేసీఆర్‌ ఉద్దేశమన్నారు. ఇందులో భాగంగా తాము రైతాంగానికి పూర్తిస్థాయిలో నీరందించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజె క్టు కాలువల ద్వారా వచ్చే సాగునీటిని కొందరు రైతులు తమపంటకు నీళ్లు పూర్తిగా అందుతాయో లేదేనని ఆందోళనతో కా లువలకు గండ్లు కొట్టడం సరికాదని సూచించారు. ప్రతి ఎకరాకూ నీరు అందించే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. పైన ఉన్న రైతులందరూ సహకరిస్తేనే చివరి ఆయకట్టు వరకూ సాగునీరు అందించే అవకాశం ఉంటుందన్నారు. కాలువలకు గండ్లు కొట్టవద్దని రైతాంగానికి తాము, రైతు సమన్వయ సమితి సభ్యులు, ఎస్సారెస్పీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇలాంటి వారిపై  చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడే ప్రసక్తి లేదన్నారు. రైతులందరికీ సాగునీరు అందించడమే తమ ఉద్దేశమనీ, రైతులు అర్థం చేసుకోవా లని కోరారు. సమావేశంలో ఎంపీపీ కొండ శంకర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆకుల కిరణ్‌ పాల్గొన్నారు.


logo
>>>>>>