మంగళవారం 31 మార్చి 2020
Peddapalli - Jan 29, 2020 , 04:28:53

యాజమాన్య పద్ధతితో గొర్రెలు పెంచాలి

యాజమాన్య పద్ధతితో గొర్రెలు పెంచాలి

పెద్దపల్లి జంక్షన్‌: యాజమాన్య పద్ధతిలో గొర్రెల పెంపకాన్ని చేపట్టాలని జిల్లా పశు సంవర్ధకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ రవీందర్‌రెడ్డి అన్నారు. ఆధుని క పద్ధతిలో గొర్రెల పెంపకంపై అవగాహన కల్పించేందుకు పశువైద్య, పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఆత్మ సహకారంతో జిల్లాలోని గొర్రెల పెంపకందారులతో అంతర్‌ రాష్ట్ర అధ్యయన యాత్ర నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ యాత్రలో భాగంగా మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బాలుపల్లిలోని అబ్ధుల్లా  గొర్రెల ఫారాన్ని జిల్లాకు చెందిన పలువురు పశువైద్యాధికారులు, గొర్రెల పెంపకందారులు, సంఘం నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ..  గొర్రెల ఫాం నిర్వహణను ప్రత్యక్షంగా చూడడం ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ యాత్రలో అవగాహన పెంచుకోవడం ద్వారా రానున్న రోజుల్లో గొర్రెల సంఖ్యను పెంచడమే కాకుండా పెంపకందారులు ఆర్థికంగా ఎదగవచ్చని అన్నారు. గొర్రెలను బయటి ప్రదేశాల్లో మేపకుండా షెడ్లలోనే పెంచి లాభాలు గడించవచ్చని సూచించారు. యాజమాన్య పద్ధతులు పాటించి ప్రభుత్వం అందిస్తున్న సహకరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లా పశు సంవర్ధకశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రామస్వామి, పశువైద్యాధికారులు కోటేశ్వర్‌రావు, కమలాకర్‌తో పాటు పెద్దపల్లికి చెందిన పలువురు గొర్రెల పెంపకందారులు, నాయకులు మారం తిరుపతి యాదవ్‌, గొడుగు రాజ్‌కుమార్‌ యాదవ్‌, కొమ్ము మల్లేశంయాదవ్‌, పొలగాని సతీశ్‌ యాదవ్‌, వేల్పుల కుమార్‌, చెల్కల జితేందర్‌ యాదవ్‌, పెంట రవి, దాడి శ్రీనివాస్‌ యాదవ్‌, దారవేని సంజీవ్‌, వేల్పుల రాము, మేరుగు చందర్‌, చంద్రశేఖర్‌లు గొర్రెల ఫారాన్నిను సందర్శించి గొర్రెల పెంపకంపై పలు మెళకువలు తెలుసుకున్నారు. 


logo
>>>>>>