గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 29, 2020 , 04:17:03

రోడ్డు ప్రమాదాల నివారణకు అందరూ సహకరించాలి

రోడ్డు ప్రమాదాల నివారణకు  అందరూ సహకరించాలి

పెద్దపల్లి టౌన్‌: రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు, ప్రజలు సహకరించాలని పెద్దపల్లి జోన్‌ డీసీపీ రవీందర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని బస్టాండ్‌ చౌరస్తాలో హెల్మెట్‌ ధరించి ద్విచక్రవాహనాలు నడుపుతున్న వాహనదారులకు గాయత్రి కళాశాల విద్యార్థినులతో కలిసి డీసీపీ పూలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలని, వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడుపరాదని  విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్‌ పోలీసులు, రవాణాశాఖాధికారులు చేపడుతున్న వారోత్సవాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ సీఐ కోట బాబురావు, పోలీసు సిబ్బంది సలీం, జాన్‌, రాజన్న, ప్రసాద్‌, కనుకయ్య, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. logo