శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 28, 2020 , 02:25:01

ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సర్పంచ్‌ n వైస్‌ చైర్మన్‌గా ఆరెపల్లి కుమార్‌..

ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సర్పంచ్‌ n వైస్‌ చైర్మన్‌గా ఆరెపల్లి కుమార్‌..

మంథనిటౌన్‌/మంథనిరూరల్‌ : మంథని మున్సిపల్‌ మొ ట్టమొదటి చైర్‌పర్సన్‌గా పుట్ట శైలజ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వైస్‌ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ నాయకుడు ఆరెపల్లి కుమార్‌తోపాటు, నూతన సభ్యులతో ఎన్నికల ప్రొసీడింగ్‌ అధికారి శెట్టి చంద్రప్రకాశ్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ గుట్టల మల్లిఖార్జునస్వామి ప్రమాణ స్వీకారం చేయించారు. మొదటగా బల్దియా ఎన్నికల్లో పట్టణంలోని 13 వార్డుల్లో గెలుపొందిన సభ్యులతో ధృవీకరణ పత్రాలపై సంతకాలు చేయించిన అధికారులు, ఆ తర్వాత చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా 2వ వార్డు కౌన్సిలర్‌ పుట్ట శైలజ పేరును 1వ వార్డు కౌన్సిలర్‌ గుండా విజయలక్ష్మి ప్రతిపాదించారు. 5వ వార్డు కౌన్సిలర్‌ నక్క నాగేంద్ర బలపర్చారు. రేసులో పుట్ట శైలజ ఒక్కరే ఉండడంతో చైర్‌పర్సన్‌గా ఎన్నిక చేస్తూ ప్రొసీడింగ్‌ అధికారి చంద్రప్రకాశ్‌రెడ్డి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. అనంతరం వైస్‌ చైర్మన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పార్టీ 3వ వార్డు కౌన్సిలర్‌ ఆరెపల్లి కుమార్‌ పేరును 11వ వార్డు టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ వీకే రవి ప్రతిపాదించగా, 6వ వార్డు కౌన్సిలర్‌ కాయితీ సమ్మయ్య బలపర్చారు. దీంతో వైస్‌ చైర్మన్‌గా ఆరెపల్లి కుమార్‌ ఎన్నిక కాగా, ఎన్నికల ప్రొసీడింగ్‌ అధికారి చంద్రప్రకాశ్‌రెడ్డి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ, వైస్‌ చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌, కౌన్సిల్‌ సభ్యులను అధికారులు చంద్రప్రకాశ్‌రెడ్డి, గుట్టల మల్లిఖార్జునస్వామి, అనుపమరావు, మంత్రి మణికంటేశ్‌ తదితరులు పుష్పగుచ్ఛాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌తోపాటు పాలకవర్గ సభ్యులు కొలువుదీరగా, పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు ప్రత్యేకంగా అభినందించారు.


logo