బుధవారం 01 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 28, 2020 , 02:24:06

సుల్తానాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా సునీత

సుల్తానాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా సునీత

సుల్తానాబాద్‌ : నూతనంగా ఏర్పడిన సుల్తానాబాద్‌ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరింది. సుల్తానాబాద్‌ చైర్‌పర్సన్‌గా  ముత్యం సునీత, వైస్‌ చైర్‌పర్సన్‌గా బిరుదు సమత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీల్డ్‌ కవర్‌లో అభ్యర్థుల పేర్లను ఉంచడంతో చివరి వరకు చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థులు ఎవరనేది  ఉత్కంఠ నెలకొంది. ఎ మ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి చైర్మన్‌ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొం ది. మధ్యా హ్నం 12.30 గంటలకు సీల్డ్‌ కవర్‌లో అధిష్టానం పంపిన పేరును 7వ వార్డు సభ్యు డు కూకట్ల గోపి చైర్‌పర్సన్‌గా అభ్యర్థిగా ముత్యం సునీతను బలపరుస్తున్నట్లు ప్రకటించడంతో ఏకగ్రీవంగా 13 మంది సభ్యులు మద్దతు తెలుపడంతో చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. తర్వాత వైస్‌ చైర్‌పర్సన్‌గా 4వ వార్డు సభ్యురాలు బిరుదు సమతకు 13 మందిసభ్యులు మద్దతు తెలిపి ఏకగ్రీవం చేశారు. చైర్‌పర్సన్‌ అభ్యర్థిత్వానికి నలుగురు సభు ్యలు గాజుల లక్ష్మి, బిరుదు సమత, పారుపెల్లి జ్ఞానేశ్వరి, ముత్యం సునీత పోటీపడగా, అధిష్ఠానం సూచించిన ముత్యం సునీతను మెజార్టీ సభ్యులు ఆమోదం తెలుపడంతో చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అధికారులు ముందుగా వార్డులసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. సభ్యులందరూ బయటకు వచ్చిన అనంతరం ఎమ్మెల్యే దాసరిని టీఆర్‌ఎస్‌ నాయకులు ముత్యం రమేశ్‌, అనుమాల బాపురావు ఎత్తుకొని విజయసం కేతం చూపారు. అనంతరం టీఆర్‌ఎస్‌ నాయకులు సంబురాలు చేసుకున్నారు. సీఐ గట్ల మహేందర్‌రెడ్డి, ఎస్‌ఐ రాజేశ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.  


logo
>>>>>>