బుధవారం 08 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 28, 2020 , 02:10:29

నేత్రపర్వంగా మార్కండేయ జయంతి

నేత్రపర్వంగా మార్కండేయ జయంతి

సిరిసిల్ల కల్చరల్‌: మార్కండేయ జయంతి ఉత్సవాల ముగింపులో భాగంగా సోమవారం సిరిసిల్ల పట్టణంలో నిర్వహించిన రథయాత్ర శోభాయమానంగా జరిగింది. ఉదయం నుంచి అర్చకులు స్వామివారికి మహాయజ్ఞం, పూర్ణాహుతి తదితర ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 6గంటలకు ప్రత్యేక వాహనంపై స్వామివారిని ప్రతిష్టించి రథయాత్రను ప్రారంభించారు. జై మార్కండేయ.. జై పద్మశాలీ అంటూ నానాదాలు చేస్తూ స్వామివారికి అడుగడుగునా నీరాజనం పలికారు. చిన్నారుల కోలాటాలు, దాండియా నృత్యాలు, సాం స్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సోలాపూర్‌ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన డ్రమ్స్‌ నృత్యాలు కనువిందు చేశాయి. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత చీటి నర్సింగారావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, సెస్‌ వైస్‌ చైర్మన్‌ లగిశెట్టి శ్రీనివాస్‌, పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు గోలి వెంకటరమణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, పద్మశాలీ యువజన సంఘం అధ్యక్షుడు గుండ్లపెల్లి పూర్ణచందర్‌, సభ్యులు కట్టెకోల లక్ష్మీనారాయణ, రాపెల్లి కళ్యాణ్‌, కట్ల ఆనం దం, కోడం శ్రీనివాస్‌, పద్మశాలీ సంఘం మహిళా సభ్యులు రథోత్సవంలో పాల్గొన్నారు.logo