శనివారం 28 మార్చి 2020
Peddapalli - Jan 25, 2020 , 03:34:12

బ్రహ్మోత్సవం.. ఇది బ్రహ్మోత్సవం!

బ్రహ్మోత్సవం.. ఇది బ్రహ్మోత్సవం!
  • నేటి నుంచి వేంకటేశ్వరుడి ఉత్సవాలు n అధ్యనోత్సవంతో మొదలు
  • పది రోజులపాటు వేడుకలు n 31న అంగరంగ వైభవంగా కల్యాణం
  • ఫిబ్రవరి 3న భారీ శోభాయాత్ర n అంగరంగ వైభవంగా ఏర్పాట్లు




కార్పొరేషన్, నమస్తేతెలంగాణ: కరీంనగర్ మార్కెట్‌రోడ్డులోని వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయి. అధ్యయనోత్సవంతో అంగరంగ వైభవంగా మొదలు కాబోతున్నాయి. పది రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఇప్పటికే ప్రధాన దారులు, చౌరస్తాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. కూడళ్లలో వివిధ దేవతామూర్తుల కటౌట్లను కూడా పెట్టారు. ఇప్పటికే దేవాలయాన్ని పూర్తిస్థాయిలో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ పరిసరాల్లో పూర్తిస్థాయిల్లో భారీగా పెడాల్స్‌ను వేశారు. దేవాలయం ప్రాంతంతోపాటు అటుగా వేళ్లే వీధుల్లోనూ లైటింగ్‌ను అమర్చారు. స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నారు. పార్కింగ్ సదుపాయాలు, ఉత్సవాల వీక్షణ, అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ముందస్తుగా బందోబస్తు సిద్ధం చేస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ రెండు రోజులుగా దగ్గరుండి మరి ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.



logo