ఆదివారం 29 మార్చి 2020
Peddapalli - Jan 25, 2020 , 03:31:14

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధంమంథనిటౌన్: మున్సిపాల్టీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలో శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ప్రారంభంకానుంది. 13 వార్డులను 3 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం రెండు హాళ్ల ను సిద్ధం చేశారు. హాల్-1లో 1నుంచి 7వ వార్డుల వరకు, హాల్-2లో 8 నుంచి 13వ వార్డుల ఓట్ల లెక్కింపు  5 టేబుళ్లపై కొనసాగనుంది. రౌండ్‌నెంబర్-1లో 1,4,6,8,11వ వార్డులు, రౌండ్ నెంబర్-2లో 2,5,7,9,12వ వార్డులు, రౌండ్ నెంబర్-3లో 3,10,13వ వార్డులకు సంబంధించిన ఓట్లను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం 5 టేబుళ్ల వద్ద ఐదుగురు ఆర్‌ఓలు, ఐదుగురు ఏఆర్‌ఓ, సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు అభ్యర్థులు, వారి ఏజెంట్లను కౌంటింగ్ హాల్‌లోకి అనుమతించనున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తుతో 144 సోక్షన్ అమలు చేయనున్నారు. చైర్మన్ ఎన్నిక కోసం ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎక్సఫిషియో ఓటింగ్ కోసం మున్సిపల్ కార్యాలయంలో కాన్‌సెంట్ ఇచ్చారు. ఎన్నికల్లో గెలుపు కోసం గత 10 రోజులుగా ప్రచారంలో కష్టపడిన అభ్యర్థుల భవితవ్యం నేటి ఓట్ల లెక్కింపుతో తేలనుండటంతో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు వారి అనుచరులు, ఆయా రాజకీయ పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. 


logo