శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 25, 2020 , 03:31:14

పంచసూత్రాలు తప్పక పాటించాలి

పంచసూత్రాలు తప్పక పాటించాలికమాన్‌పూర్: ప్రతి ఒక్కరూ పంచసూత్రాలు పాటించాలని జిల్లా మైనింగ్ అధికారి, మండల ప్రత్యేకాధికారి సాయినాథ్ అన్నారు. మండలంలో స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమంలో భాగంగా జూలపల్లి గ్రామంలో మంథని డీఎల్‌పీవో రాంబా బు, ఎంపీడీఓ వెంకటేష్‌జాదవ్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్డి, ఇంకుడుగుంత, కంపోస్టు ఫిట్‌లు తప్పనిసరిగా నిర్మించుకోవాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేరు చేయాలని, ప్లాస్టిక్ కవర్ల వాడాకాన్ని పూర్తిగా నిర్మూలించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొల్లపెల్లి శంకర్‌గౌడ్, ఎంపీటీసీ సభ్యులు శెవ్వ శంకరయ్య, అబ్బిడి వినోద, గ్రామ ప్రత్యేకాధికారి, ఆర్‌ఐ సునందతోపాటు వార్డు సభ్యులు, వివిధశాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే కమాన్‌పూర్, గుండారం, పేరపల్లి, గొల్లపల్లి, రొంపికుట, నాగారం, పెంచికల్‌పేట, సిద్దిపల్లె, పెంచికల్‌పేట గ్రామాల్లో కూడా స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. ఆయాగ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామప్రత్యేకాధికారులు, కార్యదర్శులు, వార్డుసభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  పంచసూత్రాల అమలుకు అందరూ తోడ్పడాలని  డీఎల్‌పీఓ రాంబాబు పేర్కొన్నారు. కల్వచర్లలో స్వచ్ఛ శుక్రవారంలో భాగంగా సందర్శించి గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు.  కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంట పద్మ, మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి, వైస్ ఎంపీపీ కాపురబోయిన శ్రీదేవి, ఎంపీటీసీ కొట్టె సందీప్, ఉప సర్పంచ్ బండ ప్రసాద్, ఎంపీఓ రామారావు, ఈజీఎస్ ఏపీఏ రమేశ్‌బాబు, గ్రామ కార్యదర్శి సురేశ్, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.


logo