శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 25, 2020 , 03:29:35

ప్రజాతీర్పును అంగీకరించే దమ్ముందా..?

ప్రజాతీర్పును అంగీకరించే దమ్ముందా..?


రామగిరి: నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్‌బాబుకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాతీర్పును అంగీకరించే దమ్ముందా..? అని మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణగౌడ్ సవాల్ విసిరారు. ఓటమి తప్పదని భావించే కాంగ్రెస్ నాయకులు ఫలితాలు రాకముందే సాకులు వెతుక్కుంటున్నారని విమర్శించారు. సెంటినరీకాలనీలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల సరళిని పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు తమకు ఓటమి తప్పదని తెలుసుకొని డైలామాలో పడ్డారన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటం, మద్యం, డబ్బులు పంచడం కాంగ్రెస్ నైజమని  తాము అభివృద్ధే ఎజెండాగా ఎన్నికలకు వెళ్లి ప్రజామోదం పొందామన్నారు. శ్రీధర్‌బాబు విప్‌గా, మంత్రిగా ఉన్న సమయంలో కూడా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని అన్నారు. ఓటర్లను భయపెట్టడమే కాకుండా ప్రతిపక్ష నాయకులను అక్రమ కేసుల్లో ఇరికించిన చరిత్ర కాంగ్రెస్ నాయకులదన్నారు. మంథని మున్సిపాల్టీకి జరిగిన ఎన్నిక అభివృద్ధి, అబద్ధానికి మధ్య జరిగినవనీ, ఈపోరులో టీఆర్‌ఎస్ విజయం లాంఛనమేనని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీపీ ఆరెల్లి దేవక్క, కొమురయ్య, జడ్పీటీసీ మ్యాదరవేని శారద, కుమార్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, నాయకులు రాచకొండ రవి, గారబోయిన నరేశ్, ఆదివారంపేట సర్పంచ్ మైదం కుమార్, ఏఎంసీ డైరెక్టర్ ఆసం తిరుపతి, నాయకులు మేడగోని రాజన్న, దేవ శ్రీనివాస్, దేవరామస్వామి, బత్తిని శ్రీనివాస్, ఉపసర్పంచ్ దామెర శ్రీనివాస్, మోహన్, శ్రీనివాస్, కుమారస్వామి, శంకేసి రవీందర్, గారబోయిన నరేశ్‌యాదవ్, సంజీవ్ తదితరులున్నారు.

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

ఆదివారంపేట గ్రామానికి చెందిన పలువురికి మంజూరైన  సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను జడ్పీచైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఎంపీపీ ఆరెల్లి దేవక్క, టీఆర్‌ఎస్ నాయకులు పంపిణీ చేశారు. సెంటినరీకాలనిలోని టీఆర్‌ఎస్ కార్యాలయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదివారంపేట గ్రామానికి చెందిన అంకూస్ కు రూ.6వేలు, వై రాజేశ్వరీకి రూ.15,500లు చెక్కులను అందించారు. 


logo