శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 24, 2020 , 02:01:29

టీఆర్‌ఎస్‌దే మేయర్‌ పీఠం

టీఆర్‌ఎస్‌దే మేయర్‌ పీఠం
  • - మెజార్టీ స్థానాల్లో విజయం ఖాయం
  • - ఈ ఎన్నికల్లో ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వైపే నిలిచారు
  • -ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌
  • - ముఖ్యనేతలు, డివిజన్‌ ఇన్‌చార్జిలు, కోఆర్డినేటర్లతో కృతజ్ఞతా సభ
  • -గెలుపు కోసం పనిచేసిన వారికి ప్రశంస పత్రాలు

గోదావరిఖని, నమస్తే తెలంగాణ : రామగుం డం నగరపాలక సంస్థ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామనీ, మేయర్‌ పీఠం టీఆర్‌ఎస్‌కే దక్కనున్నదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో గురువారం టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకు లు, డివిజన్‌ ఇన్‌చార్జిలు, కో-ఆర్డినేటర్ల కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీని పూర్తి స్థాయిలో విశ్వసించారని, కా ర్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేయడం ఖా యమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలిచిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలనీ, నిస్వార్థంగా సేవలందించాలని సూచించారు. ప్రతి డివిజన్‌లో అభివృద్ధి కార్యక్రమాలతోపాటు మెడికల్‌ క్యాంపులు, కౌన్సిల్‌ అధికారులతో సమావేశా లు, మహిళా సాధికారత కోసం పాటుపడాలన్నా రు. టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నిర్ణయం మేరకు నడుచుకోవాలని సూచించారు. ఎన్నికల్లో క్రియాశీలకంగా పని చేసిన 125 మందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నూతి తిరుపతి, శంకర్‌ నాయక్‌, దొంత శ్రీ నివాస్‌, గుండు రాజు, చెల్కలపల్లి శ్రీనివాస్‌, అభిషేక్‌ రావు, శ్రీనివాస రెడ్డి, గట్టయ్య, అడ్డాల రామస్వామి, గణేశ్‌, గంగ శ్రీనివాస్‌, మారుతి, కృష్ణవేణి, ఉమారాణి, రాజేందర్‌, శ్రీనివాస్‌, పాతపెల్లి రవి, స్వామి, శంకర్‌ గౌడ్‌, మొగిళి, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.logo