బుధవారం 01 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 23, 2020 , 03:47:02

మంథని మున్సిపల్ క్లీన్ స్వీప్ తథ్యం

మంథని మున్సిపల్ క్లీన్ స్వీప్ తథ్యం


మంథనిటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ పార్టీ మంథనిలో క్లీన్ చేస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని 13 వార్డుల్లోని పోలింగ్ కేంద్రాలను బుధవారం ఆయన పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న ఓటర్లను, ప్రజలను పుట్ట మధు అప్యాయంగా పలకరించారు.  సాయంత్రం స్థానికంగా ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. మంథని మున్సిపాల్టీ పరిధిలోని ఓటర్లంతా అభివృద్ధిని కాంక్షించి టీఆర్ పార్టీ వైపే ఉన్నట్లుగా పోలింగ్ సరళిని బట్టి అర్థమవుతుందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసిన ఓటర్లు టీఆర్ పార్టీ అభ్యర్థులను నిండు మనస్సుతో తమ ఓటు వేసి ఆశీర్వదించారన్నారు.

మున్సిపల్ పరిధిలోని 80శాతం పోలింగ్ నమోదు కావడంపై హర్షం వ్యక్తం చేశారు. అధిక పోలింగ్ నమోదుతో 13 వార్డులకు 13 వార్డులను టీఆర్ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. 25వ తేదీన జరుగనున్న కౌంటింగ్ తర్వాత టీఆర్ పార్టీ చైర్మన్ పదవీని తన ఖాతాలో వేసుకొని ఈ విజయాన్ని సీఎం కేసీఆర్ కానుకగా అందిస్తామన్నారు. మున్సిపల్ కొత్త చట్టం ద్వారా ప్రజాసేవకు ప్రజాప్రతినిధులు సైతం బాధ్యులయ్యారన్నారు. దీంతో ప్రజలకు మరింత మె రుగైన సేవలు అందడానికి, ప్రజాప్రతినిధులు సైతం క్రమశిక్షణతో పని చేయడానికి వీలు కలుగుతుందన్నారు.

నూతనంగా ఏర్పాటైన మంథని మున్సిపాల్టీపై  టీఆర్ జెండాఎగురుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా  సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి టీఆర్ పార్టీకి ఓటు వేసి తమ మద్దతును ప్రకటిస్తున్నారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి మౌళిక వసతుల కల్పనే ధ్యేయంగా పని చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ గెలుపునకు కష్టపడిన  పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో పార్టీ అభివృద్ధి కోసం మున్ముందు కూడా కష్టపడి పని చేయాలని కోరారు. కార్యక్రమంలో భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ, టీఆర్ రాష్ట్ర నేత చంద్రుపట్ల సునీల్ ఎంపీపీ కొండ శంకర్, పీఏసీఎస్ చైర్మన్ ఎక్కెటి అనంతరెడ్డి, కమాన్ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ, మండల అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, నాయకులు ఆకుల కిరణ్, తగరం శంకర్ చల్లా నారాయణరెడ్డి, కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>