మంగళవారం 07 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 23, 2020 , 03:46:13

స్ట్రాంగ్ భవితవ్యం

స్ట్రాంగ్ భవితవ్యం
  • - ఆయా మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ కాలేజీల్లో భద్రపరిచిన ఎన్నికల అధికారులు
  • - రామగుండంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పర్యవేక్షించిన కలెక్టర్
  • - చుట్టూ కట్టుదిట్టమైన భద్రత


గోదావరిఖని టౌన్ : నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు బుధవారం సాయంత్రం వరకు బ్యాలెట్ బాక్స్ చేరుకున్నాయి. రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లకు బుధవారం జరిగిన ఎన్నికలు సాయంత్రం వరకు ప్రశాంతంగా ముగిశాయి. ఈ మేరకు నగర పాలక సంస్థ పరిధిలోని యైటింక్లయిన్ కాలనీ, రామగుండం, ఎన్టీపీసీతోపాటు గోదావరిఖని నగరంలోని పలు డివిజన్లలో ఎన్నికలు ముగిసేసరికి అధికారులు పోలీసుల బందోబస్తు నడుమ బ్యాలెట్ బాక్సులను ప్రత్యేక వాహనాల ద్వారా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్ రూంకు తరలించి భద్రపరిచారు.

అనంతరం రాత్రి సమయంలో జిల్లా ఎన్నిక అధికారి శ్రీదేవసేన, జిల్లా అదనపు ఎన్నికల అధికారి శ్రీనివాస్ స్ర్టాంగ్ రూంలకు అభ్యర్థుల సమక్షంలో తాళాలు వేళారు. ఈ క్రమంలో అక్కడ పరిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అనంతరం వార్డుల వారీగా పోలైన ఓట్ల వివరాలు అధికారులు వెల్లడించారు.
logo