బుధవారం 01 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 22, 2020 , 04:21:56

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు


పెద్దపల్లిప్రతినిధి, నమస్తేతెలంగాణ: కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్నిరకాల చర్యలు తీసుకున్నామని రామగుండం సీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం ఆయన జిల్లాకేంద్రంలోని ఎన్నికల పోలింగ్, ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50డివిజన్లు, పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలోని 34వార్డులు, సుల్తానాబాద్ మున్సిపాల్టీ పరిధిలోని 15వార్డులు, మం థని మున్సిపాల్టీ పరిధిలోని 13వార్డుల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఎక్కడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేసినా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఒక కార్పొరేషన్, 9మున్సిపాల్టీల్లో ఎన్నికలను నిర్వహిస్తున్న నేపథ్యంలో 75రూట్లల్లో 7వేల మంది సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టామని వెల్లడించారు.

రామగుండం కార్పొరేషన్ పరిధిలో సీపీ సత్యనారాయణ, పెద్దపల్లి జోన్ డీసీపీ రవీందర్, పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలో డీసీపీ పులిగిల్ల రవీందర్, ఏసీపీ హబీబ్ సుల్తానాబాద్ డీసీపీ అడ్మిన్ సంజీవ్ మంథనిలో లా అండ్ డీసీపీ రవికుమార్ పర్యవేక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాకు సంబంధం లేని వారు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉండవద్దని, ఇక్కడి ఓటర్లు మాత్రమే ఉండాలన్నారు. స్థానికేతరులకు సంబంధించి ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయని, వారిని అప్రమత్తం చేసి వారి ప్రమే యం ఎక్కడా కనిపించకుండా గట్టి నిఘాను పెట్టినట్లు వివరించారు. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించి, పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, అధికారులకు ఆయన పలు సూచనలు చేశా రు. సమావేశంలో పెద్దపల్లి సీఐ ప్రదీప్ ట్రాఫిక్ సీఐ కోట బాబూరావు, ఎస్ ఉప్పతల ఉపేందర్, సహదేవ్ షేక్ జానీపాషా ఉన్నారు.

ప్రలోభాలకు గురిచేసిన వారిపై కేసు నమోదు

పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలోని ఒకరిపై ప్రలోభాలకు గురిచేయడంతో కేసు నమోదు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. పెద్దపల్లి పోలీస్ పరిధిలోని మొస్సు హుస్సేన్, ఫ్లయింగ్ టీ-02 ఫిర్యాదు మేరకు       ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే పెద్దపల్లిలోని శాంతినగర్ చెందిన ఓల్లెపు వెంకన్న డబ్బులు తీసుకున్నందుకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ. 30,000 స్వాధీనం చేసుకుని, దర్యాప్తు అనంతరం చార్జిషీట్ ఫైల్ చేయడం జరుగుతుందని సీపీ సత్యనారాయణ తెలిపారు.
 

ఏర్పాట్లు పూర్తి చేశాం..

ఫెర్టిలైజర్ రామగుండం కమిషనరేట్ పరిధిలోని తొమ్మిది మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్ ఎన్నికలకు పూర్తిగా రంగం సిద్ధం చేసినట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు మొత్తం 75రూట్లలో పోలింగ్ సిబ్బంది తమతమ సామగ్రితో సహా చేరుకున్నారన్నారు. మంగళవారం ఆయన బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొమ్మిది మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్ 2వేల పోలీస్ సి బ్బందిని బందోబస్తు చేపట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో 6 మున్సిపాల్టీల్లో వెయ్యి మంది పోలీసులను నియమించినట్లు చెప్పా రు. ఎలక్షన్ కోడ్ సందర్భంగా ఎన్నికల ప్రవర్తన ని యమావళిని ఎవరు ఉల్లంఘించినా కేసులు నమో దు చేస్తామని, ఇప్పటికే సుమారు 300మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని వివరించారు. రెండుమూడు రోజులుగా కొంతమంది మద్యం పంపిణీ చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆ యా పార్టీల నాయకుల వద్ద మద్యం సీజ్ చేసి కేసు లు నమోదు చేసి అరెస్టు చేశామని వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖల, పోలీస్, రెవెన్యూ మున్సిపల్ శాఖల సమన్వయంతో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటను జరుగకుండా పూర్తి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.


logo
>>>>>>