శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 22, 2020 , 04:20:35

పర్యవేక్షణకే కంట్రోల్ ఏర్పాటు

పర్యవేక్షణకే కంట్రోల్ ఏర్పాటుకలెక్టరేట్: జిల్లాలో పోలింగ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకే కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. కలెక్టరేట్  కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను మంగళవారం ఆమె పరిశీలించారు. కంట్రోల్ పనితీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవసేన మాట్లాడుతూ, రామగుండం కార్పొరేషన్ పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాల్టీలకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ సరళిని కంట్రోల్ రూం ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చన్నారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేసిన 69 వెబ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తామన్నారు.

ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగిన అన్ని ఏర్పా ట్లూ చేశామని స్పష్టం చేశారు. ప్రజలు కూడా జిల్లాలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు విజయవంతంగా ముగిసేలా సహకరించాలని కోరా రు. జిల్లాలో వందశాతం పోలింగ్ నమోదయ్యేలా ఓటర్లు తమ ఓ టు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ ముగిసిన వెంటనే అధికారులు సామగ్రిని భద్రంగా రీసెప్షన్ కౌంటర్లకు తరలించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట పలువురు అధికారులు ఉన్నారు.


logo