సోమవారం 06 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 21, 2020 , 01:33:56

మంథనిలో టీఆర్‌ఎస్‌దే విజయం

మంథనిలో టీఆర్‌ఎస్‌దే విజయం


మంథనిటౌన్‌: ప్రజాస్పందన చూస్తే మంథని మున్సిపాల్టీ టీఆర్‌ఎస్‌ విజయం ఇప్పటికే ఖరారైందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు అన్నారు. సోమవారం ఆయన 4, 5, 6వ వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కుర్ర లింగయ్య, నక్క నాగేంద్ర, కాయితీ సమ్మయ్యకు మద్దతుగా, పట్టణంలోని ప్రధాన చౌరస్తాలోని షాపింగ్‌ ఏరియాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వాడవాడల్లో తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. పుట్ట మధు పర్యటనలో గంగాపురి, బోయినిపేట ప్రాంతాల్లో ప్రజలు అధిక సం ఖ్యలో తరలివచ్చి మంగళహారతులతో స్వాగతం పలికి విజయ తిలకందిద్దారు. పూలు చల్లుతూ ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్‌ మాట్లాడుతూ, ఈనెల 22న జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో మంథనిలో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం తథ్యమన్నారు. పార్టీ అభ్యర్థులు, తాము ఏ వార్డులో తిరిగినా కూడా అభివృద్ధి చేసే టీఆర్‌ఎస్‌ పార్టీకే మళ్లీ పట్టం కడుతామని ఓటర్లు ఆశీర్వదిస్తున్నారన్నారు. ఓటర్ల స్పందన చూస్తే మున్సిపాల్టీలోని అన్నివార్డులను టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీ ప్‌ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు చూపించే ఆదరాభిమానాలతో రాజకీయాల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తూ ప్రజాభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. ప్రచారం సందర్భంగా బోయినిపేటకు వెళ్లిన జడ్పీ చైర్మన్‌ సమక్షంలో పలువురు టీఆర్‌ఎస్‌లో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రచార కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మున్సిపల్‌ ఎన్నికల జిల్లా పరిశీలకులు కర్ర శ్రీహరి, టీఆర్‌ఎస్‌ నేతలు సునీల్‌రెడ్డి, జగన్‌మోహన్‌రావు, ఏగోలపు శంకర్‌గౌడ్‌, ఆకుల కిరణ్‌, శంకెసి రవీందర్‌, బత్తుల సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.


logo