బుధవారం 01 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 21, 2020 , 01:32:41

టీఆర్‌ఎస్‌కే పట్టంగట్టండి

టీఆర్‌ఎస్‌కే పట్టంగట్టండి
కలెక్టరేట్‌ / పెద్దపల్లిటౌన్‌ / పెద్దపల్లి జంక్షన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజైన సోమవారం మున్సిపల్‌ పరిధిలోని ఆయా వార్డుల్లో ఎన్నికల దాసరి మనోహర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులతో కలిసి విస్తృత ప్రచారం చేపట్టారు. 1,12,22,24,25, 26,32,33వ వార్డుల్లో ఆయన ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలుకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం పెద్దపల్లి మున్సిపాల్టీపై గులాబీ జెండా ఎగురవేసేందుకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆదరించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, నాయకులు బండారి శ్రీనివాస్‌గౌడ్‌, అమర్‌నాధ్‌, వేల్పుల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>